Anshu Ambani : టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున హీరోగా నటించిన మన్మథుడు సినిమా గుర్తుందా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాను ఇప్పటికీ ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంది. సినిమాలో నాగార్జున బ్రహ్మనందం కామెడీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ లో నటించిన హీరోయిన్ అన్షు అంబానీ ఇప్పటికీ చాలామంది క్రష్ లిస్ట్ లో ఉంది. గుండెల్లో ఏముందో కళ్లల్లో తెలుస్తోందంటూ అన్షు పాడిన లవ్ మెలోడీ అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. ఐతే ఏమైందో ఏమోగానీ ఈ సినిమా తర్వాత మళ్లీ అన్షు అంబానీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు.
Read Also:CM Chandrababu: పీ-4 విధానంపై దృష్టి పెట్టాలి.. అట్టడుగున ఉన్న వారి అభివృద్ధికి తోడ్పడాలి
అయితే మన్మథుడు తర్వాత అన్షు అంబానీ మళ్ళీ 23 ఏళ్లకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో తెలుగులో ప్రముఖ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న మజాకా అనే సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అన్షు ఈ సినిమాలో యశోద అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలియజేస్తూ పోస్టర్ కూడా షేర్ చేశారు. దీంతో అన్షు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే దాదాపుగా 23 సంవత్సరాల తర్వాత తమ ఫెవరెట్ హీరోయిన్ రీఎంట్రీ ఇస్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also:Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్.. దానిపై చర్చకు సిద్ధమా..!
ఈ విషయం ఇలా ఉండగా నటి అన్షు తెలుగులో ప్రభాస్ నటించిన రాఘవేంద్ర సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత మిస్సమ్మ సినిమాలో గెస్ట్ పాత్రలో నటించి, ఓ తమిళ్ సినిమా చేసి సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత లండన్ కి చెందిన సచిన్ సాగర్ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది. పెళ్లయిన తర్వాత సినిమాలకి పూర్తిగా గుడ్ బై చెప్పి కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తోంది. ప్రస్తుతం అన్షు కి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్ లో మంచి ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసి అలరించిన అన్షు సెకెండ్ ఇన్నింగ్స్ లో ఏవిధంగా రాణిస్తుందో చూడాలి.