NTV Telugu Site icon

Manjummel Boys : ఇళయరాజా కు మంజుమ్మల్ బాయ్స్ ప్రొడ్యూసర్ కౌంటర్..

Manjummel Boys

Manjummel Boys

Manjummel Boys : మలయాళంలో ఈ ఏడాది రిలీజ్ అయిన మంజుమ్మల్ బాయ్స్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.నిజజీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారీ విజయం సాధించింది.మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను చిత్రయూనిట్ తెలుగులో కూడా రిలీజ్ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.థియేటర్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ రీసెంట్ గా ఓటిటిలోకి వచ్చింది.ఓటిటీలో కూడా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

Read Also :Bhagavanth Kesari : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ‘భగవంత్ కేసరి’హిందీ వెర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

తాజాగా మంజుమ్మల్ బాయ్స్ మూవీ చిత్రయూనిట్ కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసులు పంపించారు.ఈ మూవీ లో గుణ మూవీలోని సూపర్ హిట్ సాంగ్ “కమ్మనీ నీ ప్రేమ లేఖలే”  పాటను చిత్ర యూనిట్ వాడుకుంది.ఈ పాటను తన అనుమతి లేకుండా సినిమాలో వాడుకున్నారని ఈ సాంగ్ కంపోజ్ చేసిన ఇళయరాజా మంజుమ్మల్ బాయ్స్ టీమ్ కు నోటీసులు పంపించారు. తాజాగా ఈ వివాదంపై ఈ మూవీ ప్రొడ్యూసర్ షాన్ ఆంథోనీ కౌంటర్ ఇచ్చాడు.తాము ఆ మూవీ మ్యూజిక్ కంపెనీల నుంచి హక్కులు కొనుగోలు చేసిన తర్వాతే ఈ పాటను వాడుకున్నట్లు తెలిపారు.ఈ పాటకు ఓనర్లు అయిన పిరమిడ్, శ్రీదేవి సౌండ్స్ నుంచి మేము హక్కులు పొందాము” అని ఆంథోనీ వివరించాడు.చట్ట ప్రకారం అన్ని హక్కులు పొందాకే ఈ సినిమాలో ఆ పాటను వాడుకున్నామని ప్రొడ్యూసర్ తెలిపారు.