Site icon NTV Telugu

Manish Sisodia: మనీష్‌ సిసోడియాకు 3 రోజుల పాటు మధ్యంతర బెయిల్

Manish Sisodia

Manish Sisodia

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట లభించింది. తన మేనకోడలు వివాహానికి హాజరయ్యేందుకు ఢిల్లీ కోర్టు సోమవారం మనీష్ సిసోడియాకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లక్నోలో జరిగే తన మేనకోడలి వివాహానికి హాజరయ్యేందుకు సిసోడియా ఫిబ్రవరి 12-16 మధ్య మధ్యంతర బెయిల్‌ను కోరారు. సీబీఐ, ఈడీ విచారిస్తున్న అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు సిసోడియాకు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ ఎంకే నాగ్‌పాల్ మధ్యంతర బెయిల్‌ మంజూరు చేశారు.

Read Also: Madhyapradesh: బుల్డోజర్‌తో కూల్చడం ఫ్యాషన్‌గా మారింది.. మధ్యప్రదేశ్ హైకోర్టు చురకలు

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి బెయిల్‌ను సీబీఐ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. మనీష్ సిసోడియా శక్తివంతమైన నాయకుడని, సాక్ష్యాలను తారుమారు చేస్తారని కోర్టులో వాదించారు. వధూవరులు మాత్రమే తమ వివాహానికి ఐదు రోజుల సెలవు కోరవచ్చని సీబీఐ వాదించింది. అందుకే ఒకరోజు మాత్రమే అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును అభ్యర్థించింది. ఇరు వైపుల వాదనలు విన్న కోర్టు.. మనీష్‌ సిసోడియాకు మూడు రోజుల పాటు అనుమతి ఇచ్చింది.వివాహ వేడుకకు పోలీసు అధికారులు హాజరుకావడానికి సిసోడియా తరపు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. దీనికి, సిసోడియా తన న్యాయవాది ద్వారా.. “నాతో పోలీసులను పంపడం ద్వారా నా కుటుంబాన్ని అవమానపరచవద్దు” అని బదులిచ్చారు.

Exit mobile version