Manipur BJP: మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోంది. సెప్టెంబర్ 13న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇంతలో రాష్ట్ర బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మణిపూర్‌లోని ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సహా ముగ్గురు బీజేపీ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సమాచారాన్ని కాంగ్రెస్.. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. దేశ రాజధానిలోని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు వై. సుర్చంద్ర సింగ్, ఎల్. రాధాకిషోర్ సింగ్, పార్టీ నాయకుడు ఉత్తమ్‌కుమార్ నింగ్‌తౌజామ్ సోమవారం కాంగ్రెస్‌లో చేరారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
READ MORE : Rohit Sharma: అర్ధరాత్రి ఆసుపత్రికి రోహిత్ శర్మ.. వీడియో వైరల్! ఆందోళనలో ఫాన్స్
మణిపూర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ సప్తగిరి శంకర్ ఉలక, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కె. మేఘచంద్ర సింగ్ సమక్షంలో ఈ నాయకులను పార్టీలోకి చేర్చుకున్నారు. “మణిపూర్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో బీజేపీ విఫలమైంది. ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ నాయకులు బీజేపీని విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మాత్రమే శాంతి, స్థిరత్వాన్ని తీసుకురాగలదు. మంచి పాలన అందించగలదనే నమ్మకం ప్రజల్లో పెరుగుతోంది. దానికి నిదర్శనమే ఈ చేరికలు.” అని కాంగ్రెస్ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు.. మణిపూర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ సహా బీజేపీ ఎమ్మెల్యేలు ఆదివారం రాజ్ భవన్‌లో భల్లాను కలిశారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో అనేక మంది ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
READ MORE : Nepal Protests: దేశం విడిచి పారిపోనున్న ప్రధాని.. భారత సరిహద్దుల్లో హై అలర్ట్..
