Manika Batra: స్టార్ ప్యాడ్లర్ మనిక బాత్రా శుక్రవారం ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో చైనీస్ తైపీకి చెందిన చెన్ స్జు-యుపై 4-3 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. ప్రపంచ ర్యాంకర్ 44వ ర్యాంకర్ మనిక మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో 6-11, 11-6, 11-5, 11-7, 8-11, 9-11, 11-9తో ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ చార్ట్‌లో 23వ ర్యాంక్‌లో ఉన్న చెన్‌ను ఓడించింది.
BCCI: సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీని తొలగించిన బీసీసీఐ.. తాజాగా దరఖాస్తులకు ఆహ్వానం
భారత ఏస్ అంతకుముందు గురువారం జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ప్రపంచ 7వ ర్యాంకర్ చైనాకు చెందిన చెన్ జింగ్‌టాంగ్‌కు షాకిచ్చింది. సెమీఫైనల్లో మనిక కొరియాకు చెందిన జియోన్ జిహీ, జపాన్‌కు చెందిన మిమా ఇటో మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతతో తలపడనుంది.