Manickam Tagore: నేడు ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాకూర్.. తాను ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్‌గా నియమితులైన తర్వాత తొలిసారి విజయవాడకు రానున్నారు.. ఉదయం 11:30కు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ఎంపీ మాణికం ఠాకూర్‌కు స్వాగతం పలకనున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. ఇక, మధ్యాహ్నం రెండు గంటలకు మాణికం ఠాకూర్ సమక్షంలో ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు చేరబోతున్నారు.. అనంతరం ఏపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మాణికం ఠాకూర్, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ లీడర్లు పాల్గొంటారు.. ఇక, సాయంత్రం 6 గంటకు ఠాకూర్, గిడుగు రుద్రరాజు మీడియా సమావేశం నిర్వహిస్తారు.
అయితే, తనకు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పాక తొలిసారి ఏపీకి వస్తున్నారు మాణికం ఠాకూర్.. దీంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.. అంతేకాదు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు వైఎస్ షర్మిల.. ఈ మధ్యే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.. తన తండ్రి వైఎస్ అడుగుజాడల్లోనే తాను నడుస్తున్నాను.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే నాన్నా లక్ష్యంగా ఉండేదని పేర్కొన్నారు. అయితే, ఆమె కాంగ్రెస్‌లో చేరి.. ఆ తర్వాత ఢిల్లీలోనే ఉండే.. సోనియా, ఖర్గే.. ఇలా పలువురు నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. కానీ, ఆమెకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు అనేదానిపై మాత్రం క్లారిటీ రాలేదు.. ఇప్పుడు ఠాకూర్ పర్యటనలో షర్మిలకు అప్పగించే బాధ్యతలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.. పీసీసీ ముఖ్య నేతలతో సమావేశం కానున్న ఠాకూర్.. ఈ వ్యవహారంపై చర్చించి ఓ నిర్ణయానికి వస్తారనే.. నేతల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారనే చర్చ సాగుతోంది. కాగా, వైఎస్ షర్మిలకు ఏపీలో కాంగ్రెస్ కీలక బాధ్యతలు అప్పగిస్తుందనే చర్చ ఆదినుంచి సాగుతూవస్తున్న విషయం విదితమే.