Site icon NTV Telugu

Mani Shankar Aiyar: రాజీవ్ గాంధీపై కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..

Mani Shankar Aiyar

Mani Shankar Aiyar

రాజీవ్ గాంధీపై కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్‌ అయ్యర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇరుకున పెట్టారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ రెండు సార్లు పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యారన్నారు. అలాంటి వ్యక్తి దేశానికి ప్రధాన మంత్రి ఎలా అయ్యారో అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై దుమారం రేగుతోంది.

READ MORE: Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం

పీటీఐకి ఇచ్చిన ఇంటర్వూలో మణిశంకర్ మాట్లాడారు. “రాజీవ్‌ గాంధీ నాతో పాటు కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో చదువుకున్నారు. అప్పట్లో పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యారు. విశ్వవిద్యాలయం విద్యార్థులను ఉత్తీర్ణులు చేయాలనే ప్రయత్నిస్తుంది. కానీ, రాజీవ్ మాత్రం పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీలో కూడా ఉత్తీర్ణత సాధించలేదు. ఇలా రెండు సార్ల ఫెయిల్ అయ్యారు. ఎంత కష్టపడ్డా ఉత్తీర్ణత సాధించలేకపోయారు. రెండు సార్లు విఫలమై, పైలట్‌గా పని చేశారు. అలాంటి వ్యక్తి దేశ ప్రధాని అవుతారని నేను ఊహించలేదు. ఇది ఎలా సాధ్యమైందో..” అని మణిశంకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అంశంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్త చేస్తున్నారు. తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు.

READ MORE: Flipkart Big Saving Days: ఆన్లైన్ షాపింగ్‌కు సిద్దంకండి.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ వచ్చేస్తుంది

Exit mobile version