NTV Telugu Site icon

Mango Ice Cream Paan : ఐస్ క్రీమ్ తో పాన్ ఏంట్రా బాబు.. వీడియో చూస్తే మైండ్ బ్లాకే..

Mango Ice Cream

Mango Ice Cream

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు చూస్తే జన్మలో అసలు వాటిని తినరు.. జనాల పైత్యానికి హద్దులేకుండా పోతుంది.. వారికున్న పిచ్చితో జనాలకు పిచ్చెక్కించేలా వింత వంటలను ట్రై చేస్తుంటారు.. కొన్ని కాంబినేషన్స్ చూస్తే ఇక అసలు ఆ ఫుడ్ ను తినాలనిపించదు.. ఇప్పుడు అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

అదే మ్యాంగో ఐస్ క్రీమ్ పాన్.. పాన్ స్వీట్ తో చెయ్యడం చూసాము.. కానీ ఐస్ క్రీమ్ తో పాన్ ఎలా చేస్తారు అనుకుంటున్నారా? ఒకసారి ఆ వీడియోను చూసేద్దాం పదండీ.. భోజనం చేశాక ఒక కిల్లి వేసుకుంటే ఇక ఏమి అవసరం లేదు.. ఈ మధ్య పాన్ ను ఎక్కువగా వేసుకుంటున్నారు.. ఒక్కొక్కరు ఒక్కోలా కిల్లిలను వేస్తారు.. అయితే ఐస్ క్రీమ్ తో పాన్ చెయ్యడం ఎప్పుడైనా విన్నారా?

నిజమే.. ఆ పాన్ తయారీ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అందులో ఓ వ్యక్తి తమలపాకును తీసుకొని కట్ చేసి, దాని పై పాన్ మసాలా, డ్రై మ్యాంగో ముక్కలు వేసి పక్కన పెడతాడు.. దాని పై చల్లని మ్యాంగో ఐస్ క్రీమ్ ను వేసి పాన్ లాగా చూడతాడు అంతే మ్యాంగో ఐస్ క్రీమ్ పాన్ రెడీ అయ్యినట్లే.. దీన్ని ఐస్ క్యూబ్స్ వేసి డని పై పెట్టి డిస్ప్లేలో పెడతాడు.. అతని దగ్గర రకరకాల పాన్స్ ఉన్నట్లు వీడియోను చూస్తే తెలుస్తుంది.. మీరు ఓ లుక్ వేసుకోండి.,