Site icon NTV Telugu

Nunna Mango Market: వెలవెలబోతున్న నున్న మామిడి మార్కెట్.. ఆందోళనకు గురవుతున్న వ్యాపారాలు!

Nunna Mango Market

Nunna Mango Market

ఆసియాలో అతిపెద్ద మామిడి మార్కెట్‌గా పేరున్న నున్న ఈసారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మామిడి కాయల ఎగుమతుల కోసం వచ్చిపోయే వాహనాలు, వ్యాపారులు, కూలీలతో కళకళలాడాల్సిన మార్కెట్‌.. ఈసారి వెలవెలబోతోంది. ముఖ్యంగా వ్యాపారుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అకాల వర్షాలు, గాలివానలు, కోడిపేను తెగుళ్లతో పంట దిగుబడి భారీగా తగ్గింది. పూత వచ్చినా.. కాయ దశకు రాకముందే పాడైపోయింది.

Also Read: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్‌.. ఆనందంలో ఆర్సీబీ ఫాన్స్!

నున్న మామిడి మార్కెట్‌లో గతంలో రోజుకు 400-500 టన్నుల ఎగుమతులు జరిగేవి. ఈసారి 200 టన్నులు కూడా కష్టమవుతోంది. ధరలు కూడా రైతులకు మద్దతివ్వడం లేదు. టన్ను బంగినపల్లి, రసాల ధర రూ.25 వేలకు పడిపోయింది. తక్కువ నాణ్యత కాయలైతే రూ.10-15 వేల మధ్యే ఉన్నాయి. ఈ పరిణామాలతో రైతులు, వ్యాపారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వాతావరణ మార్పులతో మామిడి పంట దిగుబడులు గణనీయంగా పడిపోవడమే ఇందుకు కారణం. గతేడాది కూడా నున్న మార్కెట్ కల తప్పిన విషయం తెలిసిందే.

Exit mobile version