NTV Telugu Site icon

Singer Mangli: సింగర్ మంగ్లీకి తప్పిన పెను ప్రమాదం.. స్వల్ప గాయాలు!

Singer Mangli

Singer Mangli

Singer Mangli Gets Injured in Road Accident: ప్రముఖ సింగర్ మంగ్లీ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో మంగ్లీకి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం శంషాబాద్‌ మండలం తొండుపల్లి సమీపంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Also Read: Meetha Raghunath Marriage: పెళ్లి చేసుకున్న ‘గుడ్‌నైట్’ హీరోయిన్ మీతా రఘునాథ్!

శంషాబాద్‌ పోలీసుల వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరయ్యారు. అదేరోజు అర్ధరాత్రి తర్వాత మేఘ్‌రాజ్‌, మనోహర్‌తో కలిసి ఆమె కారులో హైదరాబాద్‌-బెంగళూర్‌ జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయల్దేరారు. శంషాబాద్‌ మండలం తొండుపల్లి వంతెన వద్దకు రాగానే.. కర్ణాటకకు చెందిన ఓ డీసీఎం వెనక నుంచి వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది.

Show comments