Site icon NTV Telugu

KSRTC Conductor: ఛీ.. ఛీ.. మరి ఇంత నీచమా.. పబ్లిక్ లో మహిళతో బస్సు కండెక్టర్?!

Ksrtc

Ksrtc

KSRTC Conductor: భారతదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల సంఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో, పబ్లిక్ ప్రయాణాలలో ఇలా అనేకచోట్ల జరుగుతున్న సంఘటనలు మహిళల పట్ల దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఓ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపుతోంది. మంగళూరు నగరానికి ముడిపు నుంచి వస్తున్న బస్సులో ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో బస్సు కండక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వ్యక్తిని ప్రదీప్ కశప్ప నాయక్‌గా గుర్తించారు. ప్రయాణిస్తున్న మహిళ నిద్రలో ఉండగా, ప్రదీప్ ఆమెకు దగ్గరగా వెళ్లి శరీరంపై అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది అక్కడి మరో ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసులు వెంటనే స్పందించారు.

ఈ వీడియో ఆధారంగా బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రదీప్‌పై భారతీయ న్యాయసంహిత సెక్షన్ 74 (అశ్లీల ప్రవర్తన), సెక్షన్ 75 (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేసి కోర్ట్ లో హాజరుపరిచి 15 రోజుల రిమాండ్ కు పంపించారు. ఈ విషయమై కెఎస్‌ఆర్‌టీసీ విభాగం స్పందించి ప్రదీప్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. డిసిప్లినరీ విచారణ పూర్తయ్యే వరకు ఆయన సేవలను నిలిపివేశారు. రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఈ విషయంపై తీవ్రంగా స్పందిస్తూ, విచారణను త్వరగా పూర్తిచేసి సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కెఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, కఠిన శిక్షలు అవసరమని ప్రజలు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version