NTV Telugu Site icon

Mangalavaaram : షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన అజయ్ భూపతి…

Whatsapp Image 2023 11 11 At 1.00.52 Pm

Whatsapp Image 2023 11 11 At 1.00.52 Pm

అజయ్ భూపతి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఆర్ఎక్స్ 100′ మరియు ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు…తాజాగా ఈ దర్శకుడు పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో మంగళవారం అనే సినిమాను తెరకెక్కించాడు..ఈ సినిమాలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ మరియు శ్రవణ్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రం నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లోవిడుదల కానుంది. ఇప్పటికే చిత్రం యూనిట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తోంది.తాజాగా ఈ సినిమా నుంచి ‘అప్పుడప్పడ తాండ్ర’ అనే సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే చిత్ర సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకునే పనిలో చిత్ర యూనిట్ కు షాక్ తగిలింది.

ఈ పాటలోని రెండు లైన్ల లిరిక్స్ ను తొలగించాలని సెన్సార్ నిర్ణయించింది. దీంతో అజయ్ భూపాతి మాత్రం సెన్సార్ కట్ కు అస్సలు అంగీకరించలేదు. మొత్తం సాంగ్ నే సినిమాలో లేకుండా చేశారు. దీనిపై తాజాగా అజయ్ భూపతి స్పందించారు. సెన్సార్ ‘అప్పడప్పడ తాండ్ర’లోని రెండు లైన్లను సెన్సార్ చేశారు. ఆ లిరిక్స్ ఛేంజ్ చేయాలని నాకు చెప్పారు. అలా చేస్తే సాంగ్ లో ఉన్న ఫీల్ అంతా పోతుంది. దాంతో థియేట్రికల్ వెర్షన్ లో ఈ సాంగ్ ను తీసేస్తున్నాము.. ఓటీటీ వెర్షన్ లో మాత్రం సాంగ్ ఉంటుందని ఆయన చెప్పారు. ఆలోగా ఫుల్ సాంగ్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేస్తామని తెలిపారు… దీంతో పలువురు సెన్సార్ ఇచ్చిన షాక్ కు అజయ్ భూపతి అదిరిపోయే రిప్లై ఇచ్చాడు గా అంటూ కామెంట్ చేస్తున్నారు..ఇక ఈ రోజు (నవంబర్ 11) హైదరాబాద్ జె.ఆర్.సి. కన్వెషన్ సెంటర్‌లో ‘మంగళవారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నారు.. అల్లు ఆర్మీ సమక్షంలో ఈ వేడుక జరగనుంది. గ్రాండ్ గా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

Show comments