NTV Telugu Site icon

Nandigam Suresh: మాజీ ఎంపీకి రెండ్రోజుల పోలీస్‌ కస్టడీ.. ఏ కేసులో అంటే..?

Nandigam Suresh

Nandigam Suresh

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కార్యాలయం పై జరిగిన దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్.. రిమాండ్ ఖైదీగా గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో విచారణ సమయంలో నందిగం సురేష్ తమకు సహకరించలేదని కేసులో దర్యాప్తు కోసం.. విచారణ చేసుకునేందు పోలీస్ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు. ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. రెండు రోజులు పాటు నందిగం సురేష్ ను పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 15వ తేదీ ఒంటిగంట నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు విచారణ చేసుకోవచ్చని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Show comments