NTV Telugu Site icon

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ..

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ మధుభానందకర్‌ సమావేశం అయ్యారు.. ఎయిమ్స్ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.. ఎయిమ్స్ సంస్థకు వసతుల కల్పించడంలో వైఎస్‌ జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని సీఎంకు వివరించారు ఎయిమ్స్ డైరెక్టర్. అయితే, టీడీపీ హయాంలో రూ.1,618 కోట్లతో ఎయిమ్స్ ఏర్పాటైందని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. కానీ, జగన్ ప్రభుత్వం ఏమైనా మౌలిక వసతులు ఏర్పాటు చేసిందా? అని చంద్రబాబు ఆరా తీశారు.. కాగా, నీటి సమస్య ఎయిమ్స్ కు ఉందన్నారు డైరెక్టర్ మధుభానందకర్. నీటి సరఫరా కోసం ప్రారంభించిన పైప్ లైన్ పనులు కూడా ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.. చివరకు ట్యాంకర్ల ద్వారా ఎయిమ్స్‌కు నీటి సరఫరా జరుగుతుందన్నారు.. దీంతో, ఐదేళ్ల కాలంలో ప్రతిష్టాత్మక సంస్థకు నీటి సరఫరా కూడా ఇవ్వలేకపోయారా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. నీటి సమస్య సహ ఇతర సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎయిమ్స్‌ డైరెక్టర్‌కు హామీ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

Read Also: New laws: జులై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాల అమలు.. అవేవో తెలుసా?