NTV Telugu Site icon

Manda Krishna Madiga : చెప్పులు కుట్టిన చేతులతోనే చరిత్ర తిరుగా రాస్తాం..

Manda Krishna Madiga

Manda Krishna Madiga

ఎస్సీ వర్గీకరణ కోసం 1994 లో స్టార్ట్ చేసామని, గజ్వేల్ కేంద్రంగా ఎస్సీ వర్గీకరణ ఆద్యం పోసిందని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం జర్నలిస్ట్ ల సేవలు మరచిపోలేమని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత దళితుల్లో విభజన అవసరమా లేదా అనే చర్చ మొదలైందని, అమరవీరుల త్యాగం తో ఏర్పాటు అయింది తెలంగాణ అని ఆయన అన్నారు. ఏ రాష్ట్రములో లేని త్యాగాలు తెలంగాణ రాష్టంలో లో జరిగాయని, ఆగస్టు 1 న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మరువలేనిదన్నారు మందకృష్ణ. దేశం చర్చించుకుంటున్న తీర్పు ఫై కొన్ని ప్రధాన తెలుగు పత్రికలు ముందుకు రాకపోవడం బాధాకరమని, Bc లో వర్గీకరణ ఉన్నప్పుడు SC లో వర్గీకరణ ఉండాలని ఉద్యమం స్టార్ట్ చేసామన్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం లో సుప్రీం కోర్టు తీర్పు ఏంతో స్ఫూర్తి దాయకమని, రిజర్వేషన్ పొందిన కులాలు 1100 కులాలు అని, రిజర్వేషన్ ఫలాలు పొందలేని కులాలలో మాదిగలు ఎక్కువగా ఉన్నారని ఆయన తెలిపారు.

Physical Harassment: బాలికకు అశ్లీల చిత్రాలు చూపించి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డ స్కూల్ స్పీపర్

అంతేకాకుండా..’రిజర్వేషన్ పొందలేని వాళ్ళకి రిజర్వేషన్ లు పొందే విదంగా సుప్రీం కోర్టు తీర్పు సమాధానం.. చెప్పులు కుట్టిన చేతులతోనే చరిత్ర తిరుగా రాస్తాము.. MRPS చేసిన పోరాట వలన అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగింది… అన్ని కులాలకు ఎదో ఒక రూపంలో ప్రభుత్వ పథకాలు అందాయి.. సమాజానికి నేను కృతజ్ఞతలు చెప్పాలి.. MRPS చేసిన పోరాటాలకు సమాజం మద్దతుగా నిలిచింది… 30 ఏళ్లుగా MRPS నిలబడ్డది అంటే అనేక త్యాగాలు ఫలితమే.. రాజకీయ పార్టీలకు దీటుగా MRPS నిలబడి SC వర్గీకరణ కోసం పోరాటం చేసింది.. చిన్న పిల్లల గుండె సమస్యల కోసం చేసిన పోరాటం ఆరోగ్య శ్రీ పథకం వచ్చింది…
2018 లో కేంద్రం ఆయుష్మాన్ పథకం గా మారింది.. పోరాటం చేసింది MRPS అయినప్పుడు అన్ని కులాలకు ఆరోగ్య శ్రీ కార్డు తెచ్చి పెట్టింది.. ప్రభుత్వం మీద ప్రధాన ప్రతిపక్షం గా నిలిచి పోరాటం చేసాం.. వృద్ధులు పెంచన్, వితంతుల పెంచన్ ల మీద పోరాటం చేసింది MRPS… కొన్ని యదార్థ సంఘటనలు పెంచన్ కోసం పోరాటం చేయడానికి దోహద పడ్డాయి.. ఇప్పుడు వృద్ధులకు, వితంతువులకు పెంచన్ రావడానికి MRPS కారణం.

Punjab Ex MP: రేప్ గురించి కంగనా రనౌత్‌ని అడగండి, ఆమెకు అనుభవం ఉంది.. పంజాబ్ నేత వ్యాఖ్యలు..

పేద ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ల కోటా పెంచింది MRPS… ఆకలి కేకల పోరాట ఫలితమే ఈరోజు 6 కిలోల బియ్యం.. ప్రియాంక రెడ్డి ఘటన లో నిందితులని ఎన్ కౌంటర్ చేసింది.. మానస యాదవ్, టేకు లక్ష్మి లపై హత్యాచారం చేసి చంపింది.. హజీపూర్ లో మర్రి శ్రీనివాస్ రెడ్డి సంఘటన లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. దీనిమీద MRPS పోరాటం చేసింది.. దీని ఫలితమే ఫాస్ట్రాక్ కోర్టు లు వచ్చాయి.. విజయాలు దక్కినప్పుడు పొంగి పోలేదు.. అవమానాలు, అపజయలు జరిగినప్పుడు కుంగి పోలేదు.. 30 ఏళ్ల పోరాటం లో మూడు విజయాలు.. అంబేద్కర్ చెప్పిన సూక్తి ప్రకారం మా పోరాటం సాగింది… SC వర్గీకరణ 59 కులాల అంశం.. అనేక పోరాట ఫలితమే ఈరోజు sc వర్గీకరణ జరిగింది.. ఇంకా SC వర్గీకరణ ను అడ్డుకోవాలని ఒక వర్గం చూస్తున్నారు….. ఇప్పటికైనా మాల సోదరులు మానవత్వం తో ఆలోచించాలి.. మూడు సార్లు అసెంబ్లీ లో వర్గీకరణ మీద చర్చ జరిగితే వర్గీకరణ జరగాలని ఎక గ్రీవ తీర్మానం జరిగింది.. రాజకీయ పార్టీలు, కమిషన్ లు,ప్రభుత్వాలు అందరూ కూడా SC వర్గీకరణ కోరుకున్నారు.. వెనుక బడిన దళిత కులాలకు న్యాయం జరగాలని కోరుకున్నాయి.. దేశ రాజ్యాంగ ధర్మాసనం తీర్పు అమలు తో మాదిగలకు న్యాయం జరిగింది.’అని మందకృష్ణ వ్యాఖ్యానించారు.