Manchu Vishnu : కన్నప్ప కేవలం సినిమా కాదు మా ప్రాణం, మా నమ్మకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప మూవీ ప్రయాణం నేడు ఎంతో గ్రాండ్ గా న్యూజిలాండ్‌లో ప్రారంభం అయింది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.మంచు విష్ణు ఈ సినిమాను భారీ ఎత్తున ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో కన్నప్ప సినిమా ఉండబోతుంది..అయితే ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్ మరియు తోట ప్రసాద్ రచయితలు గా పని చేస్తున్నారు . ఈ సినిమా షూట్‌కు సంబంధించి మంచు విష్ణు ఆసక్తికర ట్వీట్ చేశారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను తెరకెక్కించే క్రమంలో సహాయపడే ప్రతీ ఒక్కరికీ ఆయన థాంక్స్ చెప్పుకొస్తున్నారు.తాజాగా ‘న్యూజిలాండ్‌లోని అద్భతమైన లోకేషన్లలో కన్నప్ప షూటింగ్‌ను ప్రారంభిస్తున్నాం. ఆ శివ పార్వతుల ఆశీస్సులతోనే ఏడేళ్ల నా శ్రమ, కల సాకారం కాబోతున్నాయి.
ఈ సినిమా కోసం గత ఎనిమిది నెలలుగా టీం అంతా కూడా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. పండుగల కూడా మరిచిపోయి కష్టపడి పని చేశాం. కనీసం రోజుకు ఐదు గంటల నిద్ర కూడా ఉండేది కాదు. ఎంత కష్టంగా అనిపించినా కూడా ఏ ఒక్కరూ కూడా అలిసిపోకుండా శ్రమించారు.ఏడేళ్ల క్రితం తనికెళ్ల భరణి గారు నాతో ఈ కన్నప్ప కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడే దాని స్థాయి ఎలా ఉంటుందో నేను ఊహించుకున్నాను. ఆ తరువాత ఈ కథలోకి ఎంతో మంది ప్రతిభావంతులైన నిపుణులు వచ్చి చేరడం జరిగింది..కన్నప్ప సినిమాకు ప్రాణం పోసేందుకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆరువందల మంది దాక పని చేస్తున్నారు. ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేస్తే ఈ కన్నప్ప నేడు ఇక్కడి వరకు వచ్చింది. కన్నప్ప సినిమా చేయగలనా? లేదా? అని నా మీద నాకే సందేహం కలిగినప్పుడు.. నన్ను నమ్మి ప్రోత్సహించిన, ముందుకు నడిపించిన మా నాన్న గారికి నా థాంక్స్. అలాగే నా బ్రదర్ వినయ్ ప్రోత్సాహం నేను ఎప్పటికీ మరిచిపోలేను.కన్నప్ప సినిమాలో ఎంతో మంది సూపర్ స్టార్లు నటించబోతున్నారు. ఆ వివరాలన్నీ త్వరలోనే ప్రకటిస్తాము అని విష్ణు తెలిపారు.. కన్నప్ప అనేది కేవలం సినిమా కాదు.. అది మా ప్రాణం, నమ్మకం, ఎంతో మంది కష్టం. మా ప్రయాణం ప్రారంభం అయింది. మనమంతా కలిసి ఓ మ్యాజిక్‌ను క్రియేట్ చేద్దాం. హర హర మహదేవ్ అంటూ మంచు విష్ణు ఒక ట్వీట్ వేశారు.
Also Read
- Rohit Sharma: ఎప్పటికీ ఆడలేరు.. రోహిత్ భవిష్యత్తుపై హేడెన్ కీలక వ్యాఖ్యలు!
- India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
- NASA ISRO Moon Base: చంద్రునిపై మానవ నివాసం.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
- 40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
EPIC ADVENTURE BEGINS
Today, I stand in awe as the adventure of a lifetime unfolds in the picturesque landscapes of New Zealand, as we commence the shooting of 'Kannappa.' This dream has been seven years in the making, and its realization is a testament to the divine blessings… pic.twitter.com/tVotX1RIJr
— Vishnu Manchu (@iVishnuManchu) September 25, 2023
తాజావార్తలు
-
Rohit Sharma: ఎప్పటికీ ఆడలేరు.. రోహిత్ భవిష్యత్తుపై హేడెన్ కీలక వ్యాఖ్యలు!
-
Baththa: స్టైలిష్ లుక్‌తో విజయ్ సేతుపతి ‘బత్తా’.. అట్లీ నిర్మాతగా క్రేజీ కాంబో.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
-
NASA ISRO Moon Base: చంద్రునిపై మానవ నివాసం.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
-
2026 Tollywood Box Office : ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలు!
ట్రెండింగ్
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!