Site icon NTV Telugu

Manchu Vishnu : కన్నప్ప మూవీ కోసం భారీగా ప్లాన్ చేస్తున్న మంచు విష్ణు..

Whatsapp Image 2023 09 23 At 10.36.46 Pm

Whatsapp Image 2023 09 23 At 10.36.46 Pm

ఇటీవల మంచు విష్ణు నటించిన సినిమాలు అంతగా సక్సెస్ అవ్వడం లేదు. రీసెంట్ గా ఆయన నటించిన జిన్నా చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప.ఆ పరమేశ్వరుడి పరమ భక్తుడు అయిన కన్నప్ప పాత్రలో నటించాలనేది మంచు విష్ణు కోరిక. ఈ సినిమా కోసం తెరవెనుక చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు.తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని నెరవేర్చుకునే దిశగా మంచు విష్ణు అడుగులు వేస్తున్నాడు.. ఇటీవల శ్రీకాళహస్తిలో మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన విషయం తెలిసిందే. విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. మహాభారతం టెలివిజన్ సిరీస్ దర్శకులలో ఒకరైన ముకేశ్ కుమార్ సింగ్ ‘కన్నప్ప’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

విష్ణు సరసన కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్ గా అయితే ఎంపికైంది.కానీ వివిధ కారణాల వల్ల ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంది. దీనితో చిత్ర యూనిట్ కొత్త హీరోయిన్ ను వెతికే పనిలో వున్నారు.. ఇంతలో ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలని చిత్రయూనిట్ ఫినిష్ చేస్తోంది. ఈ చిత్ర షూటింగ్ మొత్తం న్యూజిలాండ్ లో సింగిల్ షెడ్యూల్ లో జరగనున్నట్లు సమాచారం..ఈ చిత్రం కోసం భారీ సెట్లు, ఇతర సామాగ్రి చాలానే అవసరం అవుతాయి. వీటికోసం గత 5 నెలలుగా 800 మంది సిబ్బంది ఎంతగానో కష్టపడుతున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. సెట్స్ కి సంబంధించిన సామాగ్రి మరియు ఆయుధాల తయారీ పనులు పూర్తయ్యాయి. దీనితో షూటింగ్ కోసం సామాగ్రి మొత్తాన్ని 8 భారీ కంటైనర్లలో న్యూజిలాండ్ తరలించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.. సముద్రమార్గం ద్వారా వీటిని తరలించారు.వీడియో ద్వారా సామాగ్రి, సెట్ కి సంబందించిన వస్తువులు, ఆయుధాల్ని చూపించారు. ఎంతో అద్భుతం గా ఆయుధాలు మరియు సెట్ కి సంబంధించిన భాగాలు ఉన్నాయి. చూస్తుంటే మంచు విష్ణు మూవీ క్వాలిటీ, అవుట్ ఫుట్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడట్లేదు అనిపిస్తుంది.న్యూజిలాండ్ లో అతి త్వరలో షూటింగ్ మొదలు పెట్టనున్నారు.ఈ చిత్ర నటీనటులంతా న్యూజిలాండ్ కి వెళ్లనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు చిత్ర యూనిట్ త్వరలోనే అందించనుంది.

Exit mobile version