NTV Telugu Site icon

Manchu Vishnu: వెన్నెల కిషోర్ కు అమ్మాయిల పిచ్చి.. వాళ్ళ కాలనీలో అమ్మాయిలు

Vishnu

Vishnu

Manchu Vishnu: ప్రెసిడెంట్ మంచు విష్ణు, కమెడియన్ వెన్నెల కిషోర్ ల మధ్య ఒక సరదా యుద్ధం నిత్యం జరుగుతున్న విషయం తెల్సిందే. వారిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా దూసుకెళ్తా సినిమాలో వీరి కామెడీ హైలైట్ అని చెప్పాలి. ఇక ఈ మధ్యనే వీరిద్దరి మధ్య కరెన్సీ నోట్ల గురించి ఒక చిన్న పాటి యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు.. 2 వేల నోటు బ్యాన్ చేసినప్పుడు.. కుప్పలు కుప్పలుగా రెండు వేల నోట్లకట్టలు ఉన్న ఫోటోను షేర్ చేస్తూ వెన్నెల కిషోర్ గారింటికి వెళ్ళినప్పుడు ఈ ఫోటో తీశాను.. ఇప్పుడాయన ఈ డబ్బును ఏంచేస్తారో అని రాసుకొచ్చాడు. ఇక ఈ ఫొటోకు వెన్నెల కిషోర్ ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఆ తరువాత ఇదంతా మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహమని, సీరియస్ గా తీసుకోవద్దని.. అది జోక్ అని చెప్పుకొచ్చాడు విష్ణు. ఇక తాజాగా మరోసారి వెన్నెల కిషోర్ గురించి ఘాటు ఆరోపణలు చేశాడు. అంటే అవి కూడా సరదాకే అనుకోండి.

Chiranjeevi: నాకు క్యాన్సర్ లేదు.. అవాకులు  చవాకులు పేలకండి.. చిరు వార్నింగ్

గత కొన్ని రోజులుగా వెన్నెల కిషోర్ హోస్ట్ గా ఒక కపుల్ షో చేస్తున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా ఈ షోకు నటుడు శివబాలాజీ, అతని భార్య మధుమిత గెస్ట్ లుగా వచ్చి సందడి చేశారు. ఇక వీరి ప్రేమ కథ గురించి చెప్పుకొచ్చారు. ఇక చివర్లో శివబాలాజీ.. మంచు విష్ణుకు కాల్ చేసి మాట్లాడాడు.. ఇక తాను వెన్నెల కిషోర్ షోలో ఉన్నాను అని చెప్పగానే.. ” వెన్నెల కిషోర్ కాలనీలో అమ్మాయిలు.. ఆయన షూటింగ్ కు వెళ్లారు అని తెలిసిన తరువాతే బయటికి వస్తారు” అని అనేశాడు. దానికి వెన్నెల కిషోర్.. మీ గురించి కాదిక్కడ నా గురించి మాట్లాడుతున్నారు అని కౌంటర్ వేశాడు. ఇక దానికి నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావ్ అని విష్ణు అనడంతో అక్కడ నవ్వులు పూశాయి. ఇక దీంతో వెన్నెల కిషోర్ కు అంత అమ్మాయిల పిచ్చి ఉందా..? ఆయన వెళితే కానీ కాలనీలోని అమ్మాయిలు బయటికి రారా.. ఏయ్ ఏయ్ కిషోర్ అన్నా అంటూ సరదాగా ఆట పట్టిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments