Site icon NTV Telugu

Manchu Mohan Babu: విష్ణుకు ప్రమాదం.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన మోహన్ బాబు

Vishnu

Vishnu

Manchu Mohan Babu: మంచు విష్ణు ప్రస్తుతం హీరోగా నిలబడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. మంచు కుటుంబం మీద వస్తున్న ట్రోల్స్ వలన.. ఆ కుటుంబం నుంచి వస్తున్న సినిమాలపై ప్రేక్షకులు ఎవరు ఆసక్తి చూపించడం లేదు. అందుకు నిదర్శనం జిన్నా. మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా.. మరి అంత ట్రోల్ కంటెంట్ ఏం కాదు. కథలో చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా చాలా సినిమాలతో పోలిస్తే బెటర్ గానే ఉంది. కానీ, మంచు కుటుంబంపై ఉన్న ట్రోలింగ్ వలనే ఈ సినిమా మంచిగా ఆడలేకపోయింది అనేది కొంతమంది అభిప్రాయం. అయితే ఈ ట్రోలింగ్ కంటెంట్ ను పక్కన పెట్టి.. ఎలాగైనా హీరోగా మరోసారి నిరూపించుకోవాలని విష్ణు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కన్నప్ప అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మహాభారతం సీరియల్‌ తీసిన ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో స్టార్ క్యాస్టింగ్ ను తీసుకొని ఆశ్చర్యపరిచాడు విష్ణు. ప్రభాస్, మోహన్ లాల్, శివన్న, అనుష్క లాంటి స్టార్లందరూ ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Ram Pothineni: ఉస్తాద్.. ఈసారి గట్టిగా ఇవ్వాలి.. గుర్తుపెట్టుకో

ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ షూటింగ్ లోనే విష్ణు ప్రమాదానికి గురయ్యాడు. యాక్షన్‌ సన్నివేశాలను డ్రోన్‌ సాయంతో చిత్రీకరిస్తుండగా.. అదుపుతప్పిన డ్రోన్‌ విష్ణు మీదకు రావడంతో ఆయన చేతికి గాయాలయ్యాయి. దీంతో షూటింగ్ ను వాయిదా వేయడం జరిగిందని, వెంటనే విష్ణు హాస్పిటల్ కు తీసుకెళ్లిన విషయం తెల్సిందే. ఇక తాజాగా విష్ణు ఆరోగ్యంపై మోహన్ బాబు ట్వీట్ చేశాడు. దేవుడు దయవలన మంచు విష్ణు బావున్నాడని చెప్పుకొచ్చాడు. “ఈ సమయంలో మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. న్యూజిలాండ్‌లో కన్నప్ప సెట్‌లో ప్రమాదం విష్ణుకు ప్రమాదం జరిగింది. భగవంతుని దయతో, అతను కోలుకునే మార్గంలో ఉన్నాడు. త్వరలో షూటింగ్‌కి తిరిగి వస్తాడు. అందరు విష్ణుకు సపోర్ట్ గా నిలిచినందుకు ధన్యవాదాలు.. హర హర మహాదేవ్” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version