Manchu Manoj : మంచు మోహన్ బాబు, మనోజ్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తండ్రీకొడుకులు బద్ద శత్రువులుగా మారారు. భౌతిక దాడుల నుంచి కేసులు పెట్టే వరకు వెళ్లారు. హైదరాబాద్‌లోని జూల్‌పల్లి ఫామ్‌హౌస్‌లో గత మూడు రోజులుగా హై డ్రామా జరుగుతోంది. ఐదు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న మోహన్ బాబుకు పరిశ్రమలో ఓ గౌరవం ఉంది. ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. నిర్మాతగా పదుల సంఖ్యలో సినిమాలను నిర్మించారు. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత. రాజకీయాల్లోనూ రాణించారు. ఆయన పార్లమెంటుకు వెళ్లారు. ఇంత గొప్ప పేరు తెచ్చుకున్న మోహన్ బాబు ఇమేజ్ ఇప్పుడు బాగా డ్యామేజ్ అయింది. తాజా పరిణామాలు ఆ కుటుంబ పరువును రోడ్డున పడేశాయి. మోహన్ బాబు, మనోజ్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. భౌతిక దాడులతో పాటు కేసులు పెట్టారు.
Read Also:Aqua Farmers: ఆక్వా రైతుల దారుణం.. కార్యకర్తను స్తంభానికి కట్టి..!
ఈ క్రమంలోనే నేడు మంచు మనోజ్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు క్షమాపణలు చెప్పారు.. మీడియాపై దాడి చేయడం బాధ కలిగించిందన్నారు. నా భార్య, ఏడు నెలల కూతురి పేరు లాగుతున్నారు.. నేను నా సొంత కాళ్ల మీద నిలబడుతున్నాను.. నేను ఎవరిని ఆస్తి అడగలేదు.. సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరాలను వెల్లడిస్తాను అన్నారు. ఇలాంటి రోజు వస్తోందని నేనెప్పుడు ఊహించలేదని మంచు మనోజ్ అన్నారు. తన భార్య ఏడు నెలల గర్భిణీగా ఉన్న సమయంలో బాధలు అనుభవించిందని ఆయన గుర్తు చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను గుర్తు చేసుకుంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. తన బంధువులపై దాడి చేశారని ఆయన తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేశారు. ఇన్నాళ్లు ఆగాను.. ఇక ఆగలేనని ఆయన చెప్పారు. తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అన్ని విషయాలు సాయంత్రం చెబుతానని ఆయన మీడియాకు తెలిపారు. తండ్రి తనుకు దేవుడని.. ఇలా ఉండేవాడు కాదన్నారు. తన తండ్రి స్నేహితులు చెప్పడం వల్లే తాను తిరిగి ఇంటికి వచ్చానని చెప్పారు.
Read Also:Funky : మాస్ కా దాస్ విశ్వక్ కొత్త సినిమా టైటిల్ ఏంటంటే ?
తాను ఎవరిపై దాడి చేయలేదని తెలిపారు. విజయ్ అనే వ్యక్తే తనపై దాడి చేశారన్నారు. ఈ విషయం తాను డీజీపికి కూడా ఫిర్యాదు చేశానన్నారు. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని మంచు మనోజ్ తెలిపారు. తాను ఒక్క రూపాయి తీసుకోకుండా సినిమాలకు పనిచేశానని చెప్పారు. వేరే వాళ్ల కడుపులను కొట్టి బతుకుదామని తనకు లేదన్నారు. తన భార్యపై అవనసర నిందలు మోపుతున్నారని తెలిపారు. మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారన్నారని ఆయన తెలిపారు. ఆస్తుల కోసం కాదని, మంచి కోసమే నిలబడతానని, సాయంత్రం అన్ని విషయాలను మీడియాకు చెబుతానన్నారు. తాను రాచకొండ కమిషనర్ ఎదుట విచారణకు హాజరవ్వడానికి వెళుతున్నట్లు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.