Site icon NTV Telugu

Manchu Manoj: తేజ సజ్జాతో గొడవలపై స్పందించిన మనోజ్

Manchu Manoj

Manchu Manoj

Manchu Manoj: తేజ సజ్జా.. టాలీవుడ్ నయా సంచలనం. వరుస సూపర్ హిట్‌లతో తనకంటూ ఒక స్టార్ డమ్‌ను క్రియెట్ చేసుకుంటున్న యువ హీరో. తాజాగా ఆయన నటించిన సూపర్ హిట్ సినిమా మిరాయ్. ఈ సినిమాలో విలన్ రోల్‌లో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటించారు. తాజా మంచు మనోజ్ ఎన్టీవీకి ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో తేజ సజ్జాతో గొడవలపై స్పందించారు. తేజా నా చిన్న తమ్ముడు లాగా. ఓ మూడు, నాలుగేళ్ల ముందు వరకు కూడా మనోడి మొఖంలో ఆ పసితనపు ఛాయలు పోలేదు. నేను తేజాను ఎక్కడైనా చూస్తే తన బుగ్గలు పట్టుకొని ముద్దు చేసేవాడిని. ఎందుకుంటే తేజాను చూస్తే నా బాబును చూసినట్లు అనిపించేది. అప్పుడు మాట ఇచ్చినదే తేజాకు.. నీ కోసం ఎప్పుడైనా వస్తా అని. అలా చేసిందే ఈ సినిమా.

READ ALSO: Pooja Hegde: పూజా హెగ్డెకు షాక్ ఇచ్చిన రష్మిక

తేజ సజ్జాకు నాకు గొడవలు ఉన్నాయని ఎందుకు అనిపిస్తున్నాయి అంటే.. తను సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక్కడే వెళ్లడం వల్ల అనిపిస్తుంది తప్పా.. అలా ఏం లేదు. నేను మరో వైపు సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాను. మేము బాగానే ఉన్నాం. మీరు అనుకున్నట్లు మా మధ్య మాటలు లేకపోతే మేము అలా కౌగిలించుకోము. ఒకవేళ ఎవరైనా నన్ను అలా కౌగిలించుకోడానికి వస్తే వద్దని ఆపేస్తా. ఎందుకు ఇదంతా డ్రామా అని వాళ్లను మధ్యలోనే ఆపేస్తా. నాకు తనపై మనస్ఫూర్తిగా ప్రేమ ఉంది కాబట్టే తనను అంతదగ్గరికి తీసుకుంటా. ఒకవేళ నాకు తనపై ఏదైనా ఉందనుకోండి.. వెంటనే వాళ్లకు తెలిసిపోతుంది. ఎందుకంటే దాచిపెడితే నేను నిద్రపోలేను. సినిమా నిర్మాత విశ్వప్రసాద్ కూడా సినిమా మొదలు పెట్టడానికి ముందే క్లారిటీ ఇచ్చారు. సినిమా ప్రమోషన్స్‌లో తేజాను అంతా తిప్పుతానని ముందే చెప్పారు. వాళ్లకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. అందుకే రిలీజ్ తర్వాత మీరు వెళ్లాలని కూడా చెప్పారు. వాళ్లకు క్లారిటీ ఉంది. అంతే అండి అంతకు మించి మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఓపెన్‌గా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా సమస్యలు రావు. ఎప్పుడైతే ఎదుటోడికి పేరు రాకుండా చేయాలని చూస్తారో అప్పుడు సమస్యలు వస్తాయి. ఇలాంటి ఇన్‌సెక్యూరిటీలు మా టీంలో ఎవరికి లేవు.

READ ALSO: Pakistan: దాయాదికి అంత దమ్ము ఉందా? పాక్ బట్టలు విప్పిన జర్నలిస్ట్

Exit mobile version