NTV Telugu Site icon

Manchu Manoj : వేంకటేష్ మూవీలో మంచు మనోజ్..క్రేజీ కాంబినేషన్ సెట్ చేస్తున్న ఆ దర్శకుడు..?

Venkatesh

Venkatesh

Manchu Manoj :టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.హిట్ ఫేమ్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.దీనితో వెంకటేష్ తనకు హిట్ ఇచ్చిన దర్శకుడితో మరో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు.వెంకటేష్ కు ఎఫ్2,ఎఫ్ 3 వంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథగా తెరకెక్కుతుంది. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

Read Also :Viswambhara : ‘విశ్వంభర’లో మెగాస్టార్ పాత్ర ఎలా ఉంటుందంటే..?

వెంకటేష్ అనీల్ రావిపుడి సినిమాలో మరో హీరోకి ఛాన్స్ ఉందని సమాచారం.గతంలో వరుణ్ తేజ్ తో కలిసి నటించిన వెంకటేష్ ఈసారి మంచు మనోజ్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో మనోజ్ ఎలాంటి పాత్ర చేయనున్నాడో తెలియాల్సి వుంది.త్వరలోనే మేకర్స్ ఈ విషయం గురించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.టాలీవుడ్ రాకింగ్ స్టార్ గా గుర్తింపు పొందిన మంచు మనోజ్ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా వున్నారు.మళ్ళీ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కుతున్న “మిరాయ్” సినిమాలో మనోజ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.దీనితో మనోజ్ వెంకటేష్ మూవీలో కనిపిస్తున్నట్లు న్యూస్ బాగా వైరల్ అవుతుంది.

Show comments