Site icon NTV Telugu

Manchu Manoj David Reddy: మరిగే రక్తం నిప్పులు కక్కింది.. గుండె వేగానికి నేల కదిలింది.. ‘డేవిడ్ రెడ్డి’ గ్లింప్స్ చూశారా!

Manchu Manoj

Manchu Manoj

Manchu Manoj David Reddy: టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కమ్‌బ్యాక్ జర్నీలో మరో మైలురాయిగా నిలిచే చిత్రం రాబోతుందని ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇటీవల విడుదలైన ‘భైరవం’ సినిమాలో పవర్‌ఫుల్ రోల్‌లో అలరించిన మంచు మనోజ్, తాజాగా ఆయన హీరోగా చారిత్రక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘డేవిడ్ రెడ్డి’తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోతో మేకర్స్ మూవీ కాన్సెప్టును రివీల్ చేశారు. ఈ చిత్రానికి హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు.

READ ALSO: Bihar: పురుషుల ఖాతాల్లో రూ.10 వేలు జమ.. అసలేం జరిగిందంటే..!

ఈ కథ 1897 నుంచి 1922 వరకు జరిగే సంఘటనలను ఆధారంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్‌లో మనోజ్ ఎంట్రీకి ముందు వచ్చిన ఒక్కో డైలాగ్ అదరగొట్టింది. 25 కోట్ల మంది కోపం వాడి ఒక్కడి రక్తంలో నిండింది, మరిగే రక్తం నిప్పులు కక్కింది.. గుండె వేగానికి నేల కదిలింది అంటూ పలికిన పవర్‌పుల్ డైలాగులు అదరగొట్టాయి. ఈ సినిమాకు హనుమరెడ్డి యాక్కంటి దర్శకత్వం వహిస్తుండగా, వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రిలీజ్ అయిన గ్లింప్స్‌లో రవి బస్రూర్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ చిత్రం దేశభక్తి, తిరుగుబాటు థీమ్‌లతో కూడిన గ్రాండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్నట్లు కనిపిస్తుంది.

READ ALSO: R Sridhar: శ్రీలంక కోచ్‌గా టీమిండియా మాజీ ప్లేయర్..

Exit mobile version