చాలా కాలం తర్వాత వెండితెరపై తన మార్క్ యాక్షన్‌ను చూపించేందుకు సిద్ధమవుతున్నారు మంచు మనోజ్. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా షేర్ చేసిన ఆయన న్యూ ప్రాజెక్ట్ ‘డేవిడ్ రెడ్డి’ (#DavidReddy) మూవీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో మనోజ్ మునుపెన్నడూ లేని విధంగా చాలా గంభీరంగా, ఊర మాస్ స్టైల్‌లో కనిపిస్తున్నారు. ఈ లుక్ చూస్తుంటే మంచు మనోజ్ ఈసారి బాక్సాఫీస్ వద్ద ఒక పవర్ ఫుల్ పర్‌ఫార్మెన్స్‌తో రాబోతున్నట్లు అర్థమవుతోంది.
Also Read : Dharmendra: ధర్మేంద్ర పద్మ విభూషణ్‌పై.. హేమమాలిని ఎమోషనల్ కామెంట్స్
ఈ అప్‌డేట్‌ను షేర్ చేస్తూ మనోజ్ ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చారు. “నాలోని సరికొత్త కోణం.. రా (Raw), రూత్ లెస్ (Ruthless), అన్‌అపాలజిటిక్ (Unapologetic)” అంటూ తన పాత్ర స్వభావాన్ని వివరించారు. ఈ ఫోటోలో మనోజ్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ‘బిందాస్’, ‘వేదం’ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోజ్, ఈ ‘డేవిడ్ రెడ్డి’ పాత్రతో మళ్ళీ ఫామ్‌లోకి రావడం ఖాయమని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. మొత్తానికి మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను చాలా సీరియస్‌గా, పక్కా ప్లానింగ్‌తో మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది.
A whole new dimension within me.
Raw. Ruthless. Unapologetic.#DavidReddy pic.twitter.com/vRjG7Rlm4y— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 26, 2026
