Manchu Manoj: మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా గ్యాప్ తరువాత మనోజ్ తన కెరీర్ పై ఫోకస్ పెట్టాడు. ఈ ఏడాదే భూమా మౌనిక ను రెండో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. ప్రస్తుతం మనోజ్ చేతిలో వాట్ ది ఫిష్ అనే సినిమా ఉంది. ఇక ఈ సినిమా కాకుండా మనోజ్.. ఈటీవీలో ఒక షో చేస్తున్నాడు. త్వరలోనే ఈ షో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ షోలో హోస్ట్ గా మనోజ్ మారాడు. ఇక తాజాగా మనోజ్..ఈటీవీ లో జరిగే దివాళీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు. అందరితో సరదాగా ఆడిపాడాడు. ఇక ఈ ఈవెంట్ లో మనోజ్ సరదాగా తన భార్య గురించి కామెంట్స్ చేశాడు. షో గురించి శ్రీముఖి చెప్పమని అడగగా.. చెప్పను అని మనోజ్ చెప్పుకొచ్చాడు. ఎలా అడిగితే చెప్తారు అని అడుగగా.. దగ్గరికి వస్తే చెప్తాను అని చెప్పుకొచ్చాడు.
Mahesh Babu: పెద్దోడు మాస్.. చిన్నోడు క్లాస్.. ఏమున్నార్రా బాబు
ఇక వెంటనే శ్రీముఖి.. మనోజ్ దగ్గరగా వచ్చి చెయ్యి పట్టుకోగానే వెనుక నుంచి దేవతా.. నా దేవతా అంటూ లవ్ సింబల్ వేయడంతో వెంటనే మనోజ్.. ” వద్దు.. వద్దు.. ఆ పని చేయకండి.. ఆళ్లగడ్డ నుంచి బాంబ్ లు పడిపోతాయి” అని చెప్పుకొచ్చాడు. దీంతో వెంటనే సెట్ లో నవ్వులు పూశాయి. భూమా మౌనిక ది ఆళ్లగడ్డ అని అందరికి తెలుసు. ఇలాంటి పనులు చేస్తే భార్య కోప్పడుతుంది అని చెప్పుకొచ్చాడు. ఇక ఆ తరువాత తనదైన పంచ్ లతో అదరగొట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ షో తో మనోజ్ ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తాడో చూడాలి.