Site icon NTV Telugu

Manchu Lakshmi: ముగిసిన మంచులక్ష్మీ ఈడీ విచారణ.. ఈ మూడున్నర గంటలు ఏం జరిగింది..?

Manchu

Manchu

Manchu Lakshmi Appears Before ED: మంచులక్ష్మీ ఈడీ విచారణ ముగిసింది.. సుమారు మూడు గంటల పాటు మంచు లక్ష్మీని ఈడీ విచారించింది. యోలో 247 యాప్ ప్రమోట్ అంశంపై మంచు లక్ష్మీ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది. యోలో 247 యాప్ ప్రమోట్ పారితోషికంపై ఆరా తీసింది. బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్ కేసులో మూడున్నర గంటలపాటు విచారణ కొనసాగింది. మంచు లక్ష్మీ బ్యాంక్ స్టేట్‌మెంట్లు ఈడీకి అందించింది.

READ MORE: Saleem Pistol arrest: నేపాల్‌లో మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అరెస్ట్.. ఐఎస్ఐతో కనెక్షన్స్

కాగా.. నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్లపై ఈడీ అధికారులు మంచు లక్షిని ప్రశ్నించారు. విచారణ అనంతరం ఆమె ఈడీ కార్యాలయం నుంచి బయటికి వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో విజయ్ దేవరకొండ, ప్రకాశ్​రాజ్, రానా దగ్గుబాటిలను ఈడీ విచారించింది. దీనిలో భాగంగా ప్రకాశ్‌రాజ్‌ను 6 గంటలు, విజయ్‌దేవరకొండను 4 గంటలపాటు విచారించారు.

READ MORE: Chevireddy: ఏసీబీ కోర్టు దగ్గర చెవిరెడ్డి హల్ చల్.. వాళ్లకు శిక్ష తప్పదంటూ హెచ్చరిక..!

Exit mobile version