Manav Suthar Record: 131 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manav Suthar Record: కొన్ని రికార్డులు పదిలంగా ఉంటాయి.. మరికొన్ని రికార్డులు తిరిగి రాయబడతాయి.. అలాంటి అరుదైన రికార్డును 131 ఏళ్ల తర్వాత సాధించారు భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్.. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన మానవ్ సుతార్.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఈ అరుదైన ఘనత సాధించాడు. వార్విక్షైర్ తరఫున గ్లామోర్గాన్‌తో జరిగిన కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఒక్క పరుగు ఇవ్వకుండా వికెట్లు పడగొట్టాడు. దీంతో 131 ఏళ్ల క్రితం నమోదైన ప్రత్యేక రికార్డును సుతార్ సమం చేశాడు.
కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో జరిగిన డివిజన్-1 మ్యాచ్‌లో వార్విక్షైర్ ఇన్నింగ్స్ 257 పరుగుల తేడాతో గ్లామోర్గాన్‌పై ఘన విజయం సాధించింది. వార్విక్షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేయగా, గ్లామోర్గాన్ రెండు ఇన్నింగ్స్‌లలో 69, 65 పరుగులకే ఆలౌటైంది. సుతార్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం మూడు బంతులు వేసి మీర్ హమ్జాను బౌల్డ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 24వ ఓవర్లో బంతిని అందుకున్న అతను వెంటనే మెయిడెన్ ఓవర్ వేశాడు. ఆ తర్వాతి ఓవర్లో నాలుగు బంతుల వ్యవధిలో క్రిస్ కుక్, జేమీ మెక్ల్రాయ్లను బౌల్డ్ చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీశాడు.
Also Read
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
1895 తర్వాత మళ్లీ ఇప్పుడే..
ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో కనీసం ఒక్క వికెట్ చొప్పున ఎలాంటి పరుగులు ఇవ్వకుండా పడగొట్టడం ఇది రెండోసారి మాత్రమే. 1895లో ఇంగ్లాండ్ ఆటగాడు టామ్ హేవర్డ్ సర్రేపై లీసెస్టర్‌షైర్ తరఫున ఆడుతూ ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు 131 సంవత్సరాల తర్వాత మానవ్ సుతార్ ఆ రికార్డును సమం చేశాడు. కాగా, శ్రీలంక పర్యటన ముగిసిన మూడు రోజులకే ఇంగ్లాండ్‌కు చేరుకున్న సుతార్, వార్విక్షైర్ తరఫున అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుత కౌంటీ ఛాంపియన్షిప్ సీజన్లో ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 21 వికెట్లు పడగొట్టాడు. సోమర్సెట్పై ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఇందులో ఉంది.
మరోవైపు. అంతర్జాతీయ క్రికెట్లోనూ సుతార్ తన సత్తా చాటాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి టెస్టులో ఏడు వికెట్లు, శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో 16 వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం వార్విక్షైర్ 12 మ్యాచ్‌ల్లో 184 పాయింట్లతో డివిజన్-1లో అగ్రస్థానంలో ఉంది. టైటిల్ రేసులో సుతార్ ప్రదర్శన జట్టుకు మరింత బలాన్నిస్తోంది.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..