మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలయింది. రిలీజ్ కు ఒకరోజు ముందుగా ప్రీమియర్స్ తో రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. చిరంజీవిని స్టైలిష్‌గా చూపిస్తూ ఫాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ముఖ్యంగా చిరంజీవి-నయనతార జోడీ సాంగ్స్ ఆకట్టుకోగా, ‘మెగా విక్టరీ మాస్ సీన్స్ ఫుల్ జోష్ ఇచ్చాయి.
Also Read : Anaganaga oka Raju : జనవరి 14న థియేటర్ లోకి పండగ సినిమా రాబోతుంది
చిరు కంబ్యాక్ సినిమా ఖైధీ నం 150 తర్వాత సాలిడ్ హిట్ లేదు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఎదురుచుసిన చిరు మొత్తానికి హిట్ కొట్టేసారు. సాలిడ్ హిట్ కోసం చూస్తున్న చిరుకు మనశంకర వరప్రసాద్ ఫ్యాన్స్ కోరిక తీర్చింది. ప్రీమియర్స్ నుండే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 84 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే నేడు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. దానికి తోడు రేపటి నుండి ఫెస్టివల్ హాలిడేస్ కావడంతో హౌస్ ఫుల్ బుకింగ్స్ ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఈ రోజుతో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరనుంది. ఏదేమైనా మన శంకర వరప్రసాద్ గారు అదరగొడుతున్నారు.
