NTV Telugu Site icon

వైరల్: అది ఫేస్ మాస్క్ కాదు… నిజంగా పామే…!!

కరోనా సమయంలో ఫేస్ మాస్క్ లు తప్పనిసరి అయ్యింది.  మాములుగా మెడికేటెడ్ మాస్క్ లతో పాటుగా గుడ్డతో తయారు చేసిన వివిధ రకాల మాస్కులు వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి.  రకరకాల డిజైన్స్ తో కూడిన మాస్క్ లు కూడా అందుబాటులో ఉంటున్నాయి.  అయితే, ఇంగ్లాండ్ లోని స్వింటన్ నుంచి మాంచెస్టర్ కు వెళ్తున్న బస్సులో ఓ ప్రయాణికుడు వెరైటీ మాస్క్ ధరించి బస్సు లో ప్రయాణం చేస్తున్నాడు.  పాము చర్మంతో తయారు చేసిన మాస్క్ లా ఉండటంతో వెరైటీ గా ఉందని అనుకున్నారు.  కాసేపటి తరువాత ఆ మాస్క్ కదలడం మొదలు పెట్టింది.  దీంతో పక్కన ఉన్న ప్రయాణాలకు షాక్ అయ్యారు.  అది పాము చర్మంతో చేసిన మాస్క్ కాదు… నిజంగా పామే అని బెంబేలెత్తారు.  ఆ పాము మెల్లిగా మెడ మీదనుంచి కదిలి చేతిమీదకు పాకింది.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.