Site icon NTV Telugu

Air Gun: సామాన్లు లిఫ్ట్ లో తీసుకెళ్లొద్దని.. ఎయిర్ గన్ చూపించి లేబర్ లను బెదిరించిన వ్యక్తి..

Air Gun

Air Gun

టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాహుల్ కాలనీలో ఒక డీసీఎం డ్రైవర్ లేబర్ లతో కలిసి సత్య మ్యాగ్నము నుంచి రాహుల్ కాలనీలో రెండవ అంతస్తుకి లిఫ్ట్లో సామాన్లు తీసుకెళ్లారు. ఇది గమనించిన కామ్రాన్ అనే వ్యక్తి లేబర్ల పై దుర్భాషలాడి వారిపై చేయి చేసుకున్నాడు. లేబర్లను ఎందుకు కొట్టారని డీసీఎం డ్రైవర్ ఫారుక్ వెళ్లి ప్రశ్నించగా కామ్రాన్ ఫారూఖ్ ని ఎయిర్ గన్ తో బెదిరింపులకు పాల్పడ్డాడు. భయాందోళనకు గురైన డీసీఎం డ్రైవర్ ఫారుఖ్ వెంటనే టోలిచౌకి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కామ్రాన్ పై ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న టోలిచౌకి పోలీసులు కామ్రాన్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Exit mobile version