NTV Telugu Site icon

Viral Video: వీడు మామూలోడు కాదురా సామీ… సింహాన్నే చెప్పుతో కొట్టిన వ్యక్తి!

Lion Copy

Lion Copy

సింహాన్ని చూస్తేనే భయంతో వణికిపోతాం. ఇక సింహం గర్జన వింటే భయంతో గుండె ఆగిపోవడం ఖాయం. అయితే ఈ వీడియోలో ఒక వ్యక్తిని చూస్తే మాత్రం ఏంట్రా వీడు ఇలా ఉన్నాడు అనక మానరు. ఈ వీడియోను horrors అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. సింహాన్ని చూస్తేనే మనం పరుగులు పెడుతూ ఉంటాం . అయితే ఈ మధ్య వైరల్ అయిన కొన్ని వీడియోలలో సింహంతో ఫుడ్ షేర్ చేసుకున్న అమ్మాయిని, సింహం పక్కన కూర్చొన్న వారిని చూశాం. అయితే సింహాన్ని కొట్టిన వారిని చూసే ఛాన్స్ ఉంటుందా? అని అడిగితే మాత్రం ఖచ్ఛితంగా నో అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే సింహం దగ్గర కూర్చుంటేనే ప్రాణం పోతుంది. అలాంటిది సింహాన్ని కొట్టడమా అంటారా. అయితే మీరు ఖచ్ఛితంగా ఈ వీడియో చూడాల్సిందే.

Viral Video: మొసలి బారి నుంచి బిడ్డను కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన తల్లి.. వీడియో వైరల్!Also Read:

ఈ వీడియోలో ఓ వ్యక్తి ఏకంగా ఒకటి కాదు రెండు సింహాల మధ్యలో కూర్చున్నాడు. అంతేకాదు ఆ వ్యక్తి కోపంతో సింహాన్ని కొట్టాడు. అది కూడా కాలి చెప్పుతో సింహం ముఖం మీద కొట్టాడు. అయినప్పటికీ సింహం ఆ వ్యక్తిని ఏం చేయకుండా ప్రశాంతంగా ఉంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. భయ్యా నువ్వు లక్కీ అందుకే సింహం ఏం చేయలేదని కొందరు అనుకుంటుంటే… దీనికి రోజు తిండిపెట్టే చెఫ్ తనే అని ఆ సింహానికి తెలుసు అందుకే విశ్వాసంతో ఏం చేయలేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో చూస్తే మాత్రం ఆశ్చర్యపోవడం పక్కా

Show comments