NTV Telugu Site icon

Agra: దారుణం.. తాగేందుకు సిగరెట్‌ ఇవ్వలేదని స్నేహితుడి హత్య

Cigarette

Cigarette

Agra: ఆర్య-2 సినిమాలో హీరో అతని స్నేహితుడు ఇద్దరు కలిసి ఒకటే సిగరెట్‌ను షేర్ చేసుకుంటారు. సిగరెట్ మీద పేర్లు రాసుకుని మరీ సగం సగం అంటూ తాగేస్తుంటారు. అయితే.. వాళ్ల స్నేహానికి గుర్తుగా సినిమాలో ఆ సన్నివేశం ఉంటే.. ఇక్కడ మాత్రం అదే సిగరెట్ ఇద్దరి స్నేహితుల మధ్య నిప్పు పెట్టింది. ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉన్న ఆ స్నేహితులు ఓ చిన్న సిగరెట్ విషయంలో గొడవ పడ్డారు. అలా సిగరెట్ విషయంలో తలెత్తిన గొడవ.. ఏకంగా ఓ హత్యకు దారి తీసింది. సిగరెట్ కోసం ఫ్రెండ్‌నే చంపేసిన దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. సిగరెట్‌ దమ్ము ఇవ్వలేదన్న కారణంతో కోట గోడ మీద నుంచి తోసి హత్య చేశాడు ఓ మిత్రుడు. సిగరెట్ పంచుకోలేదన్న కారణంతో శుక్రవారం ఆగ్రా జిల్లాలో 27 ఏళ్ల యువకుడిని అతని స్నేహితుడే హత్య చేశాడని.. పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు వెల్లడించారు.

misbehaviour with students: నిట్‌లో కీచకపర్వం..! విద్యార్థినులతో వెకిలిచేష్టలు..

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆగ్రాకు చెందిన కప్తాన్ సింగ్, సుహైల్ ఖాన్‌ ఇద్దరు మంచి మిత్రులు కాగా.. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి సిగరెట్ తాగేందుకు కోట దగ్గరకు వెళ్లారు. స్నేహితులిద్దరూ కోట గోడపై కూర్చుని సిగరెట్ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ సమయంలో ఆవేశానికి లోనైన నిందితుడు సుహైల్‌ ఖాన్‌, తన స్నేహితుడు కప్తాన్‌ సింగ్‌ను కోట గోడపై నుంచి 30 అడుగుల లోతున్న గుంతలోకి తోసి చంపేశాడని వెల్లడించారు. గమనించిన స్థానికులు తీవ్రగాయాలైన కప్తాన్‌ సింగ్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో చనిపోయేముందు, ఆసుపత్రికి వెళ్లే మార్గంలో కప్తాన్‌ సింగ్ అతని సోదరుడు లఖన్‌ సింగ్ ఫోన్ చేసి.. జరిగిన విషయం గురించి చెప్పాడు. సుహైల్‌ ఖాన్‌ తన తోసేశాడని వివరించాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణ సమయంలో నిందితుడు సుహైల్‌ ఖాన్‌ తాను మత్తులో ఉన్నాని.. సిగరెట్ కోసం చాలాసార్లు అడిగానని, కానీ అతను నిరాకరించడంతో కోట గోడపై నుంచి నెట్టానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. క్షణికావేశం వల్ల కొందరు తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటున్నారని.. వాటి వల్ల ప్రాణ స్నేహితులను కూడా కోల్పోవాల్సి వస్తుందని పోలీసులు అన్నారు. దానికి నిదర్శనంగా ఈ ఘటనను ఉదహరించారు.