NTV Telugu Site icon

Viral Video: ఎవడ్రా నువ్వు.. ఇంత ట్యాలెంటెడ్‌గా ఉన్నావు.. ఏకంగా కరెంట్ తీగల మీదే మొదలు పెట్టేశావ్

Viral Video

Viral Video

Viral Video: నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఎంత శక్తివంతగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు తమ అభిప్రాయాలను, ఆలోచనలను, ప్రతిభను పంచుకోవడానికి ఈ వేదికను ఉపయోగిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే తపనతో హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. వింత విన్యాసాలు, ప్రమాదకరమైన స్టంట్లు, అసభ్యకరమైన ప్రవర్తనతో కూడిన వీడియోలను పోస్ట్ చేస్తూ క్షణాల్లో సెలబ్రిటీలుగా మారిపోవాలని ఆరాటపడుతున్నారు. గత కొద్దికాలంగా ఇలాంటి వైరల్ వీడియోలు విపరీతంగా పెరిగిపోయాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో రైళ్లు వంటి రద్దీ ప్రదేశాల్లో ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కొందరు యువకులు అయితే ఏకంగా విద్యుత్ స్తంభాలపైకి ఎక్కి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

Read Also: Revolt RV BlazeX: సరసమైన ధరలో కిల్లింగ్ లుక్స్, అదిరిపోయే ఫీచర్స్‌తో వచ్చేసిన కొత్త ఎలక్ట్రిక్ బైక్

తాజాగా, ఒక వ్యక్తి విద్యుత్ స్తంభంపైకి ఎక్కి కరెంట్ తీగలపై ఏకంగా వర్కౌట్లు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. సాధారణంగా జిమ్ లలో వర్కౌట్లు చేస్తూ తమ శరీరాన్ని దృఢంగా మలచుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తారు. మరికొందరు బరువైన వస్తువులను ఎత్తుతూ, తమ బలాన్ని ప్రదర్శిస్తారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం ఏకంగా కరెంట్ స్తంభంపై వర్కౌట్లు చేస్తూ తన ప్రాణాలను పణంగా పెట్టాడు. అయితే, అతను కరెంట్ తీగలపైకి ఎక్కినప్పుడు కరెంట్ లేకపోవడంతో ఏమి కాలేదు. ఈ విన్యాసం చూస్తుంటే.. కావాలనే కరెంట్ నిలిపివేసి ఇలాంటి స్టంట్ చేసినట్లు కనపడుతోంది. కానీ, అతను చేసిన పని మాత్రం అత్యంత ప్రమాదకరమైనది. ఇలాంటి విన్యాసాలు చేసేటప్పుడు చిన్న పొరపాటు జరిగినా, ప్రాణాలకే ప్రమాదం.

Read Also: Best Mileage Cars: బెస్ట్ మైలేజ్ అందించే తోపు పెట్రోల్ కార్లు ఇవే.. ధర కూడా తక్కువే

ఇక ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎవడ్రా నువ్వు.. ఇంత ట్యాలెంటెడ్‌గా ఉన్నావు అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరేమో పబ్లిసిటీ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే తపనతో ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పబ్లిసిటీ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం కంటే.. తమ ప్రతిభను, నైపుణ్యాలను ఉపయోగించి ప్రజల దృష్టిని ఆకర్షించడం మంచిది.