NTV Telugu Site icon

Washing Machine Bursts : తృటిలో తప్పిన ప్రాణాపాయం

Washing Michine

Washing Michine

ఓ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. లాండ్రీ నుంచి ఓ వ్యక్తి తన దుస్తులను తీసుకుని బయటకు వెళ్లిన కొద్దినిమిషాలకే రూంలోని వాషింగ్ మెషీన్ లలో ఒకటి పేలిపోయి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో సదరు వ్యక్తి లోపలే ఉంటే అతడి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి.

Read Also : Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

ఓన్లీ బ్యాంగర్స్ ఈ వీడియోను ట్విట్టర్ లోనే చేర్ చేయగా ఇప్పటి వరకు 40 లక్షల వ్యూస్ లభించాయి. ఈ వీడియోలో ఓ వ్యక్తి తన దుస్తులను ఉతుక్కుని డ్రై చేసుకున్న తర్వాత లాండ్రీ నుంచి బయటకు రావడం కనిపిస్తుంది. అతడు లాండ్రీ నుంచి బయటకుపడిన కొద్ది సెకండ్ లకే ఓ వాషింగ్ మెషీన్ పేలిపోయి మంటలు వ్యాపించాయి.

Read Also : Indigo flight: హైదరాబాద్ లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్.. కారణం?

పేలుడు భయంకరంగా ఉండటంతో ఆ సమయంలో ఆక్కడ ఎవరైనా ఉంటే తీవ్రంగా గాయపడే వారు. ఈ వీడియోను చూసిన నెటిజన్ల తలో రకంగా స్పందించారు. ప్రమాదం నుంచి ఆ వ్యక్తి సురక్షితంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నామని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. బ్యాటరీ సమస్యతోనే పేలుడు జరిగి ఉంటుందని మరో యూజర్ సందేహం వ్యక్తం చేశారు. యాక్షన్ మూవీ ఓపెనింగ్ సీన్ లా ఉందని మరో యూజర్ పేర్కొన్నాడు.

Read Also : EAPCET-2023: ఈఏపీ సెట్‌లో మళ్లీ ఇంటర్‌ వెయిటేజీ..

ఇదిలా ఉంటే ఈ ఘటనపై లాండ్రీలో జరిగిన ప్రమాదంపై ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం జరిగిన దానిపై అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Show comments