Site icon NTV Telugu

Man Killed For Pulling Beard: గడ్డం లాగినందుకు గ్యాంగ్‌స్టర్‌నే చంపేశారు..

Pulling Beard

Pulling Beard

Man Killed For Pulling Beard: జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ రంజిత్ సింగ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిని ఈరోజు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన సరబ్‌జీత్ సింగ్ అలియాస్ చబూను అరెస్టు చేసినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (తూర్పు సింగ్‌భూమ్ జిల్లా) ప్రభాత్ కుమార్ తెలిపారు. జైలులో ఇద్దరి మధ్య ఉన్న శత్రుత్వమే ఈ హత్యకు కారణమని తెలిపారు.

వారిద్దరూ జైలులో ఉన్నప్పుడు అమర్‌నాథ్ సింగ్ ముఠా సభ్యుడు రంజిత్ సింగ్ ఒకసారి సరబ్‌జిత్ గడ్డం లాగినట్లు ఆ అధికారి తెలిపారు. గడ్డం సిక్కు సమాజానికి ముఖ్యమైన మతపరమైన చిహ్నం కాబట్టి అది సరబ్‌జీత్‌ సింగ్ మనోభావాలను దెబ్బతీసిందని.. ఇద్దరూ జైలు నుంచి విడుదలైన తర్వాత రంజిత్‌ సింగ్ హత్యకు సరబ్‌జీత్ పథకం వేశాడని ఎస్పీ చెప్పారు. రంజిత్ సింగ్ తన కుమార్తెతో కలిసి అక్టోబర్ 3న నగరంలోని టెల్కో ప్రాంతంలోని దుర్గాపూజ పండల్‌ను సందర్శించినప్పుడు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసులో నలుగురిపై కేసు నమోదు అయినట్లు వెల్లడించారు.

Ban on Bursting Crackers: పేలిస్తే జైలుకే.. బాణాసంచాను పూర్తిగా నిషేధించిన ఢిల్లీ సర్కారు

ఈ హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఇంతకుముందు అరెస్టు చేయగా.. కీలక నిందితుడైన సరబ్‌జీత్ సింగ్‌ను ఇవాళ అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నాలుగో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నేరానికి ఉపయోగించిన రెండు తుపాకులు, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. రంజిత్ సింగ్‌పై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి, వాటిలో హత్య, కొన్ని ఆయుధాల చట్టం కింద ఉన్నాయి. సరబ్‌జీత్ సింగ్ కూడా వివిధ కేసుల్లో అండర్ ట్రయల్ అని పోలీసులు తెలిపారు.

Exit mobile version