Mobile Theft: అదృష్టం బాగుంటే ఒంటెపై కూర్చున్న వ్యక్తిని కూడా కుక్క కాటు వేయవచ్చని అంటారు. పూణెకు చెందిన ఓ వ్యక్తి విధి ఎంత దారుణంగా మారిందంటే.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే రెండు ఘటనలకు బలయ్యాడు. మొదట సాయం కోరిన ఓ వ్యక్తి తన మొబైల్‌తో పారిపోయాడు. ఘటన తర్వాత.. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్న బాధితుడికి సాయం పేరుతో మరో వ్యక్తి బైక్‌ను ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించి పూణెలోని భోసారి పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 406, 420 కింద కేసు నమోదైంది.
Read Also:Telangana Rains: రాష్ట్రంపై శాంతించని వరుణుడు.. 24గంటల్లో ఆరుగురు బలి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జూలై 20న జరిగింది. ఓ వ్యక్తి తన వద్దకు వచ్చి తన ఇంట్లో ఓ ముఖ్యమైన పని చేయాల్సి ఉందని చెప్పాడని బాధితుడు తన ఫిర్యాదులో పేరొన్నాడు. అతని దగ్గర ఫోన్ కూడా లేదు. దీంతో ఏదో అర్జంట్ అయి ఉంటుందిలే అనుకుని బాధితుడు కాల్ చేయడానికి తన ఫోన్ ఇచ్చాడు. మొబైల్ చేతికి చిక్కగానే సదరు వ్యక్తి పారిపోయాడు. ఈ వ్యక్తి సమస్య ఇక్కడితో ముగియలేదు. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ చిరునామా కోసం అక్కడ ఉన్న ప్రజలను అడిగాడు. ఈ ముఠాతో సంబంధమున్న మరో వ్యక్తి అక్కడ ఉన్నాడు. బాధితుడి వద్దకు వచ్చి జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సహాయం చేస్తానని చెప్పాడు. అందుకు ప్రతిగా సిగరెట్ ఇవ్వమని చెప్పాడు ఈ దుండగుడు. బాధితుడు సిగరెట్ కొనేందుకు సమీపంలోని దుకాణానికి రాగానే.. ఆ దుండగుడు బైక్‌తో పరారయ్యాడు. ఈ కేసులో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also:Rohit Sharma: ఆ కారణంతోనే టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నా: రోహిత్ శర్మ
