Site icon NTV Telugu

Video Viral: కింగ్ కోబ్రాకు స్నానం చేయిస్తున్న వ్యక్తి.. వీడియో వైరల్..!

Snake

Snake

ప్రపంచంలో కింగ్ కోబ్రాకు సంబంధించిన పాములు చాలా ఉన్నాయి. ఈ పాముల్లో అనేక విభిన్న జాతులు ఉన్నాయి. అవి ప్రపంచంలోని దాదాపు అన్నీ ప్రదేశాలలో కనిపిస్తూ ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. మనకు కనిపించే కొన్ని పాములు విషపూరితమైనవి కానప్పటికీ.. మరికొన్ని పాములు చాలా విషపూరితమైనవి. అవి కాటు వేస్తే.. మనిషి కొన్ని గంటల్లోనే చనిపోతాడు. అలాంటి విషపూరిత పాములలో కింగ్ కోబ్రా కూడా ఒకటి. ఈ పామును చూస్తే జనాలు పరుగులు తీస్తారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఎలాంటి భయం లేకుండా కింగ్ కోబ్రాకు స్నానం చేయిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Crude Bomb Blast: బంతి అనుకుని బాంబుతో ఆడేందుకు యత్నం.. ఇద్దరు పిల్లలకు గాయాలు

ఈ వీడియోలో.. కింగ్ కోబ్రా ఒక ఇంటి వెలుపల నేలపై ఉండగా.. ఓ వ్యక్తి పాము తలపై నీటిని పోస్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ పాము కూడా అలా నీళ్లు పోస్తుంటే.. సరదాగా స్నానం చేస్తోంది. మాములుగా అయితే పామును చూసి పారిపోయే జనాలు ఉంటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఆ పాము తలపై నీళ్లు పోస్తూ భయపడకుండా అలానే ఉన్నాడు. అయితే శ్రావణ మాసంలో పాములకు సంబంధించిన ఇలాంటి వీడియోలు తరచూ కనిపిస్తుంటాయి.

Vivek Agnihotri: ‘ద కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ సంచలన కామెంట్స్.. ప్రభాస్‌ని ఉద్దేశించేనా?

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో _.అమన్_ది_స్నేక్_లవర్.__ అనే ఐడితో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు ఒక లక్షా 20 వేల సార్లు వీక్షించారు. అంతేకాకుండా 13 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు. ఈ వీడియోపై మరికొందరు కామెంట్స్ చేశారు. ‘బ్రదర్, దయచేసి క్షేమంగా ఉండండి, ఇది కింగ్ కోబ్రా’ అని కొందరు, ‘మహాదేవ్ ఈ వ్యక్తిపై తన ఆశీస్సులు కురిపిస్తాడు’ అని కొందరు అంటున్నారు.

Exit mobile version