NTV Telugu Site icon

Viral Video: వాటిని అలా కూడా దాస్తారా? కొత్తగా కొన్న ఇంటి గోడలో ఉన్నది చూసి షాకైన ఓనర్

Viral

Viral

Man Found in Liquor Bottles in the Walls Of New House:  కొంతమందికి కొత్త ఇళ్లు కొన్నప్పుడు వాటి పునాదుల్లో, గోడల్లో బంగారం, వెండి, పురాతన నాణెలు దొరకడం చూశాం. చాలా చోట్ల వీటికి సంబంధించి న్యూస్ విని ఉంటాం. కొన్ని కొన్ని సార్లు ఇంటి గోడల్లో అనుకోకుండా పొడవైన పాములు ఉన్న సంఘటనలు కూడా చూసుంటాం, విని ఉంటాం. అయితే అలాగే అనుకొని ఓ జంట కొత్తగా కొన్ని తమ ఇంటి గోడను పగుల గొట్టి చూసింది. దాంట్లో బంగారం, వజ్రాలు లాంటి విలువైన వస్తువులు దొరుకుతాయి అనుకున్నారు. అయితే అందులో ఉన్నవి చూసి ఆ జంట షాక్ కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Also Read: Madhya Pradesh: యువకుడి ఆత్మహత్య.. కారణం తెలిస్తే ఇలా కూడా ఉంటారా అనుకోవడం పక్కా

ఈ వీడియోను క్యాటుక్యామ్ప్ (cataukamp) అనే యూజర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. ‘కొత్త ఇళ్లు కొన్నాం. అప్పటి నుంచి ఒకటే వానలు.దీంతో బేస్ మెంట్ మొత్తం పాడయ్యింది. అయితే వాటిని సరిచేసే క్రమంలో గోడ లోపల చూడగా మేం వీటిని కనుగొన్నాం. గోడలో ఏముంది అనే అడిగే వారి కోసం నేను దీనిని షేర్ చేస్తున్నాను’ అని క్యాప్షన్ జోడించారు. ఇక వీడియోలో కనుక మనం చూసినట్లయితే ఓ వ్యక్తి గోడకు కన్నం చేస్తాడు. అక్కడ బంగారం, వెండిలాంటి విలువైన వస్తువులు ఉంటాయని భావిస్తాడు. అయితే అక్కడ మాత్రం అతను మద్యం బాటిళ్లను కనుగొంటాడు. అవి కూడా ఖాళీ చేసిన మద్యం బాటిళ్లు. వాటిని బయటకు తీసేటప్పుడు ఏంటిరా ఇవి ఇలా ఎవరైనా చేస్తారా అంటూ చిరాకుగా ఆ వ్యక్తి ముఖం పెట్టడం గమనించవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇక కొంతమంది ఇంటిని కాదు రిపేర్ చేయించాల్సింది లివర్ ను అంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. పాపం ఎన్ని ఆశలు పెట్టుకొని గోడను పగుల గొట్టాడో చూస్తుంటేనే అర్థం అవుతుందంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.