NTV Telugu Site icon

Hotel Bill : లగ్జరీ హోటళ్లో దిగాడు.. లక్షల బిల్లు ఎగ్గొట్టాడు

Hotel

Hotel

Hotel Bill : అబుదాబి రాజకుటుంబానికి చెందిన ఉద్యోగిగా పరిచయం చేసుకుని లగ్జరీ హోటల్ బిల్ ఎగ్గొట్టాడు ఓ ఘనుడు. ఢిల్లీలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో నాలుగు నెలల పాటు బస చేసేందుకు రాజకుటుంబానికి చెందిన ఉద్యోగిగా నటిస్తూ ఓ వ్యక్తి రూ. 23 లక్షల బిల్లును ఎగ్గొట్టి అదృశ్యమయ్యాడు. శనివారం లీలా ప్యాలెస్ హోటల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు మోసం, దొంగతనాలకు పాల్పడిన మహ్మద్ షరీఫ్ కోసం ఢిల్లీ పోలీసులు వెతుకుతున్నారు. షరీఫ్ ఆగస్ట్ 1న లీలా ప్యాలెస్‌లోని 427వ గదిలో దిగాడు. నవంబర్ 20న గప్ చుప్ గా మాయమయ్యాడు. అతను పారిపోయిన విషయాన్ని గమనించిన హోటల్ సిబ్బంది అతను గదిలో వెతకగా.. గదిలోని వెండి పాత్రలు, ముత్యాల ట్రేతో సహా అనేక వస్తువులను దొంగిలించాడని కనిపెట్టారు.

Read Also:Naxalite Arrested : ఆస్పత్రికి వచ్చి పోలీసులకు అడ్డంగా బుక్కైన నక్సలైట్లు

తాను యూఏఈ ప్రభుత్వానికి చెందిన ముఖ్యమైన వ్యక్తిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఫేక్ బిజినెస్ కార్డును ఉపయోగించాడు. అబుదాబి రాయల్ ఫ్యామిలీ షేక్ ఫలాహ్ బిన్ జయేద్ అల్ సహయన్ కు అత్యంత క్లోజ్ గా పని చేశానని చెప్పాడు. ఫేక్ బిజినెస్ కార్డు, ఇతర డాక్యుమెంట్లను చూపించాడు. హోటల్ లో చెకిన్ అయిన తర్వాత హోటల్ సిబ్బందితో మాట్లాడుతూ వారిని దగ్గర చేసుకున్నాడు. నాలుగు నెలల్లో ఆయన బిల్లు రూ 35 లక్షలు అయింది. రూ. 11.5 లక్షలు చెల్లించి… మిగిలిన మొత్తం చెల్లించకుండా వెళ్లిపోయాదు. నవంబర్ 20న చెల్లని చెక్కును ఇచ్చి జంప్ అయ్యాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతను ఇచ్చిన డాక్యుమెంట్లు, సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా అతన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.