Site icon NTV Telugu

Man Steal Flower Pots : ఖరీదైన ఎస్‎యూవీ కార్లో వచ్చి.. క్యా ‘కియా’ రే

Viral Video 4

Viral Video 4

Man Steal Flower Pots : కుక్క తోక వంకర అనే సామెత వినే ఉంటారు. దొంగ బుద్ధి ఉన్న వాడికి ఎన్ని కోట్లు ఉన్నా ఎక్కడో ఓ చోట అది బయటపడుతూనే ఉంటుంది. కార్లు, బంగ్లాలు ఉన్నోళ్లంతా హుందాగా ఉంటారనుకోవడం పొరపాటే. కొన్నిసార్లు మాటల ద్వారానో, మరికొన్ని సార్లు చేతల ద్వారానో తమ బుద్ధి ఏంటో చూపిస్తూనే ఉంటారు. అలాంటి ఘటనలు గురించి నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి మరో ఘటనే ఢిల్లీలో చోటుచేసుకుంది. ఇద్దరు ధనవంతులు పూలకుండీలు దొంగతనం చేస్తూ వీడియోకు అడ్డంగా దొరికిపోవడం వైరల్ అవుతోంది.

Read Also: Thai Drug Dealer : డామిట్ కథ అడ్డం తిరిగింది.. ఎన్ని సర్జరీలు చేయించుకున్న దొరికేశా

జీ20 సమ్మిట్ న్యూఢిల్లీలోని గురుగ్రామ్​లో జరగనుంది. మార్చి 1 నుంచి 14 వరకు జరిగే జీ20 మీటింగ్​లో వివిధ దేశాలకు చెందిన చాలా మంది ప్రతినిధులు హాజరవనున్నారు. ఈ సమావేశం కోసం గురుగ్రామ్​అధికారులు సమ్మిట్ జరిగే హోటల్స్​తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, రోడ్లను సుందరంగా అలంకరించారు. చాలా చోట్ల కుండీల్లో పూల మొక్కలను ఏర్పాటు చేశారు. అయితే, ఈ మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన పూలకుండీల్లో కొన్నింటిని రూ.40 లక్షల విలువైన ఖరీదైన కియా కారులో వచ్చిన ఇద్దరు రిచ్ పీపుల్ ఎత్తుకెళ్లారు. పూలకుండీలను కారు డిక్కీలో పెట్టుకుని తీసుకెళ్తున్న దృశ్యాలు ఎవరో వీడియో తీశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై గురుగ్రామ్ అధికారులు స్పందించారు. పూలకుండీలు ఎత్తుకెళ్లిన వారి మీద చర్యలు తీసుకుంటామన్నారు.

Exit mobile version