Site icon NTV Telugu

Gujrat: ప్రమాదంలో చనిపోయిన కొడుకు.. ఇష్టమైన బైక్‌ను అతనితో పాటు పాతిపెట్టిన కుటుంబం

Bike

Bike

ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బైకులు, కార్లు, ఇతర వాహనాలను జాగ్రత్తగా చూసుకుంటుంటారు. అవి పాడైపోయాక కూడా ఇంట్లోనే భద్రంగా భద్రపరుచుకుంటుంటారు. వాటిని కుటుంబ సభ్యులుగా భావిస్తుంటారు. ఈ క్రమంలో గుజరాత్‌లోని ఖేడా జిల్లాలోని నదియాద్‌లోని ఉత్తర్‌సంద గ్రామంలో ఒక భావోద్వేగ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో బైక్ ప్రియుడైన యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించగా అతని కుటుంబం అతని బైక్‌తో అంతిమ వీడ్కోలు పలికింది. అంత్యక్రియలు నిర్వహిస్తున్నప్పుడు, కుటుంబం అతనికి ఇష్టమైన బైక్‌తో పాతిపెట్టాలని నిర్ణయించుకుంది. అతను ప్రేమించిన బైక్ ఎల్లప్పుడూ అతనితోనే ఉండాలని కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు, అతనికి ఇష్టమైన వస్తువులను కూడా అతనితో పాటు పాతిపెట్టారు.

Also Read:Bollywood : బాలీవుడ్‌ను హవా సాగిస్తున్న సీనియర్ భామలు

నదియాద్‌లోని ఉత్తరసంద గ్రామంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన 18 ఏళ్ల క్రిష్ పర్మార్ ప్రమాదానికి గురయ్యాడు. అతను తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై ప్రయాణిస్తుండగా గ్రామం సమీపంలో ట్రాక్టర్ ట్రాలీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్రిష్ ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 12 రోజుల తర్వాత తుదిశ్వాస విడిచాడు. క్రిష్ మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబం బరువెక్కిన హృదయంతో ఆయన అంత్యక్రియలు నిర్వహించింది. అంత్యక్రియల్లో ఆయన బైక్, ఆయనకు ఇష్టమైన వస్తువులను కూడా ఆయనతో పాటు ఖననం చేశారు. ఆయనకు ఇష్టమైన బైక్ తో ఆ కుటుంబం భావోద్వేగ వీడ్కోలు పలికింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింటా వైరల్ గా మారాయి.

Exit mobile version