NTV Telugu Site icon

Man Buried by Snow: మంచులో కూరుకుపోయిన వ్యక్తిని కాపాడిన మరో వ్యక్తి

Snow Skipper

Snow Skipper

అడుగుల్లోతు మంచులో కూరుకుపోయిన ఓ వ్యక్తిని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాషింగ్టన్ నార్త్ వెస్ట్ లోని మౌంట్ బేకర్ స్కీ ఏరియా గుండా సదరు వ్యక్తి రైడింగ్ చేస్తూ కిందకి వెళ్తున్నప్పుడు స్నోబోర్డ్ మంచులో నుంచి బయటకు కనిపించింది. ఆ స్నోబోర్డ్ ఉపయోగించిన వ్యక్తి అందులో కూరుకుపోయి ఉంటాడని ఊహించాడు. వెంటనే అక్కడ మంచును తవ్వి పోశాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి ప్రాణాలను నిమిషాల్లోనే కాపాడాడు. ఈ సహాయక చర్య చేపట్టిన వ్యక్తి తలకు బిగించిన కెమెరాలో విజువల్స్ రికార్డ్ అయ్యాయి.

Read Also : Dy CM Narayana Swamy: చంద్రబాబు, పవన్‌పై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి హాట్ కామెంట్స్

ఫ్రాన్సిస్ జెబేర్ అనే వ్యక్తి స్నోబోర్డు పై వేగంగా వెళ్తున్నాడు… ఇంతలో ఓ చెట్టు వద్ద ఆయనకు మంచులో నుంచి బయటకు కనిపించిన ఓ స్నోబోర్డు కనిపించింది. వెంటనే అక్కడ అనుమానంతో ఆగాడు. ఆచెట్టు పక్కనే మంచులో ఒకరు కూరుకుపోయి ఉంటాడని అనుమానించాడు. దీంతో కేక వేశాడు. కానీ ఏ సమాధానం రాలేదు. అంతే వేగంగా చేతులతోనే మంచు గడ్డలను పక్కకు తవ్వి తీశాడు.. ఇలా తీస్తుండగా ఓ వ్యక్తి చేతులు కనిపించాయి. ఎలా ఉన్నావ్.. శ్వాస తీసుకుంటున్నవా.. అని మళ్లీ కేకలు పెట్టాడు.

Read Also : Cunning Friend : ఫ్రెండ్ అని నమ్మితే.. పెళ్లికి పనికి రాకుండా చేశాడు

కానీ అటు వైపు నుంచి ఏ సమాధానం రాలేదు. మళ్లీ కంంత తవ్వి ఆ వ్యక్తి ముఖం వరకు మంచు తవ్వేశాడు.. ముఖం నుంచి ముఖ్యంగా నోటీ నుంచి మంచును తొలగించి ఆ వ్యక్తి శాస్వ తీసుకోవడానికి మార్గం సుగమం చేశాడు. ఆ వెంటనే తన బ్యాగ్ లో నుంచి మంచును తోడే షాల్ తీశాడు. వేగంగా మంచును తొలగించాడు. అప్పుడు ఆ వ్యక్తి మంచు కొద్ది కొద్దీగా మాట్లాడటంతో మొత్తం అతన్ని మంచు నుంచి బయటకు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధితుడిని ఇయాన్ స్టేజర్ గా గుర్తించారు.. కాపాడిన వ్యక్తి ఫ్రాన్సిస్ జుబేర్ గా గుర్తించారు. జుబేర్ ను రియాల్ హీరో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments