NTV Telugu Site icon

Bharat Jodo Yatra: రాహుల్‌ను హగ్ చేసుకునేందుకు పరిగెత్తుకొచ్చిన యువకుడు.. వీడియో వైరల్

Rahul Gandhi

Rahul Gandhi

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర సందర్భంగా మంగళవారం ఓ వ్యక్తి రాహుల్ గాంధీ భద్రతను ఉల్లంఘించడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. మంగళవారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ భారత్ జోడో యాత్రలో ఓ వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని హగ్‌ చేసుకునేందుకు యత్నించాడు. ఈ ఘటన పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో పసుపు రంగు జాకెట్ ధరించిన వ్యక్తి రాహుల్ గాంధీ వైపు వచ్చి కౌగిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. రాహుల్‌ పక్కన నిలబడిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను తోసేశారు.

Dawood Ibrahim: కరాచీలో దావూద్‌ ఇబ్రహీం మళ్లీ పెళ్లి చేసుకున్నాడట..!

రాహుల్ గాంధీకి జెడ్-ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు. అంతర్గత భద్రతా వలయాన్ని ఛేదిస్తూ ఓ వ్యక్తి రాహుల్ వద్దకు రావడం కలకలం రేపిందిరాహుల్ గాంధీ జెడ్-ప్లస్ కేటగిరీ భద్రత, అంతర్గత వలయాన్ని అందించే పనిలో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) భారత్ జోడో యాత్రలో పెద్ద లోపాలకు కారణమైందని కాంగ్రెస్ ఆరోపించింది. మంగళవారం ఉదయం హోషియార్‌పూర్‌లోని తండాలో భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ చౌదరి, రాజ్ కుమార్ చబ్బేవాల్‌లు రాహుల్ గాంధీతో పాటుగా యాత్రలో పాల్గొన్నారు.తన యాత్రకు విశేష స్పందన లభిస్తోందని రాహుల్ గాంధీ చెప్పారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలపై కూడా ఆయన బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రయాణంలో చాలా వరకు తెల్లటి టీ-షర్టును మళ్లీ ధరించి కనిపించిన రాహుల్ గాంధీ, దారిలో చాలా మంది వ్యక్తులతో సంభాషించి, వారితో ఫోటోలు దిగారు.