Tirupati: ప్రేమోన్మాది ఘాతుకం.. తనను విస్మరించిందని ప్రేయసిపై కత్తితో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati: రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. పోలీసులు ఎన్ని రకాలుగా చట్టాలు తీసుకొచ్చినా.. దేశం అభివృద్ధిలో దూసుకుపోతున్నా మహిళలు, యువతులు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. హత్యలు, యువతులపై అత్యాచారాలతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తాజాగా తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ ప్రేమోన్మాది. తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. అర్ధరాత్రి సమయంలో యువతి ఇంట్లోకి ప్రవేశించి కత్తితో దాడికి పాల్పడి ఆమెను తీవ్రంగా గాయపరిచిన ఘటన చంద్రగిరిలో జరిగింది. కుటుంబ సభ్యుల ప్రకారం.. చంద్రగిరి ఆర్ఎఫ్ రోడ్డుకు చెందిన యువతి చిన్నతనంలోనే తల్లిందండ్రులను కోల్పోయింది. ఆమె అమ్మమ్మ మంగమ్మ చిన్నప్పటి నుంచి ఆ యువతిని పెంచి పోషించింది. నర్సింగ్ పూర్తిచేసుకున్న యువతి ఏడాది క్రితం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సింగ్ శిక్షణ తీసుకుంటోంది. ఈ క్రమంలో తన పక్కింట్లో అద్దెకుంటున్న కృష్ణయ్య కుమారుడు పిడతల మహేష్ యువతికి పరిచయమయ్యాడు. కొన్నాళ్లు ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. తర్వాత మహేష్ చెడువ్యసనాలు తెలుసుకున్న యువతి అతని నుంచి దూరమైంది. అప్పటి నుంచి మహేష్ యువతిపై కక్ష పెంచుకున్నాడు. తరచూ వేధింపులకు పాల్పడేవాడు. అయితే వారికి మగదిక్కు లేకపోవడంతో ఏంచేసినా ఏం అనలేకపోయేవారు.
Read Also: Theft : వ్యాపారి కళ్లల్లో కారం కొట్టి… రూ.33లక్షల బ్యాగుతో ఉడాయించారు
Also Read
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
నెలన్నర క్రితం యువతి ఇంట్లోకి అక్రమంగా చొరబడిన ప్రేమోన్మాది మహేష్, యువతితో పాటు ఆమె అమ్మమ్మపై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. స్థానికులు యువకుడిని అడ్డుకున్నారు. ఆపై యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. రక్షణ లేకపోవడంతో పది రోజుల క్రితం యువతి పెద్దమ్మ వచ్చి ఆమెను చైన్నెకి తీసుకెళ్లింది. ఆ యువతి చంద్రగిరి ఆర్ఎఫ్ రోడ్డులో ఉంటున్న అద్దె ఇల్లును ఖాళీ చేసేందుకు గురువారం రాత్రి తన పెద్దమ్మతో కలిసి చెన్నె నుంచి చంద్రగిరికి చేరుకుంది. విషయం తెలుసుకున్న మహేష్ అర్ధరాత్రి సమయంలో కత్తి తీసుకుని యువతి ఇంట్లోకి ప్రవేశించాడు. తర్వాత యువతిపై కత్తితో దాడిచేశాడు. ఆమె ఛాతి, ఎడమ చేతిపై దాడి చేయడంతో తీవ్ర రక్తగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో కత్తిని అక్కడ పడేసి ప్రేమోన్మాది మహేష్ పారిపోయాడు. అనంతరం స్థానికులు అక్కడకు చేరుకు ని, యువతిని 108 వాహనంలో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రుయా ఆస్పత్రికి చేరుకుని దాడికి గల కారణాలపై ఆరా తీశారు. నిందితుడు మహేష్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
- Tags
తాజావార్తలు
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!