NTV Telugu Site icon

Arrest : మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

Arrested

Arrested

బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు, విలువైన వస్తువులు లాక్కొని మహిళపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానితుడు, సాహిల్ ఖాన్ అలియాస్ మహ్మద్ అఫ్సరుద్దీన్ 2018 లో మహిళతో స్నేహం చేసి, ఆమెతో సంబంధాన్ని పెంచుకున్నాడు. ఓ సమావేశంలో సాహిల్ ఆ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. “సాహిల్ మరో ఇద్దరు మజిద్ మరియు అబూ ద్వారా మహిళ నుండి రూ. 4 లక్షల నగదు, ఒక ఐఫోన్, బంగారం మరియు ఇతర వస్తువులను తీసుకున్నాడు. అతను మహిళపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు’ అని బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ కేఎం రాఘవేంద్ర తెలిపారు. ఫిర్యాదు మేరకు పోలీసులు సాహిల్, అతని భార్య సహర్ ఖాన్, అబు, మాజిద్‌లపై కేసు నమోదు చేశారు. సాహిల్‌ను అరెస్టు చేయగా, మిగిలిన వారు పరారీలో ఉన్నారు.

Kishan Reddy : అభూతకల్పన, అంకెల గారడి, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప బడ్జెట్ లో ఏమి లేదు

ఇదిలా ఉంటే.. మలక్‌పేట ప్రభుత్వ అంధ బాలికల హాస్టల్‌లో 8 ఏండ్ల అంధ బాలిక లైంగిక దాడి ఘటనపై కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌ ఇంచార్జీ వార్డెన్‌ బి. స్వప్నను గురువారం సస్పెండ్‌ చేశారు. సంఘటనపై నిజనిర్దారణ కమిటీని నియమంచి పూర్తిస్థాయి రిపోర్టు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈ కమిటీలో వికాలంగుల సాధికారత శాఖ డైరెక్టర్‌, కమిషనర్‌ బి. శైలజ, సభ్యులుగా బీసీ సంక్షేమ శాఖాధికారి ఆశన్న, , ఏ రాజేందర్‌లను నియమించారు. ఈ కమిటి రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి.

Konda Surekha :స్మితా సబర్వాల్ పై కొండా సురేఖ స్పందన