Site icon NTV Telugu

Bramayugam : సెన్సార్ పూర్తి చేసుకున్న మమ్ముట్టి ‘భ్రమయుగం’.. రన్ టైం ఎంతంటే..?

Whatsapp Image 2024 01 30 At 8.42.47 Pm

Whatsapp Image 2024 01 30 At 8.42.47 Pm

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ భ్రమయుగం. ఈ చిత్రానికి రాహుల్‌ శశీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి మేకర్స్‌ ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూనే ఉన్నారు. తాజాగా భ్రమయుగం చిత్ర యూనిట్ ఈ సినిమా సెన్సార్ అప్‌డేట్ ను అందించింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్‌ యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. సెన్సార్ అప్‌డేట్ ప్రకారం భ్రమయుగం రన్‌ టైం 140 (2 గంటల 20 నిమిషాలు) నిమిషాలు.ఈ చిత్రం ఫిబ్రవరి 15న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.భ్రమయుగంలో అమల్ద లిజ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో సిద్దార్థ్‌ భరతన్‌, అర్జున్ అశోకన్‌ మరియు జిసు సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.రీసెంట్ భ్రమయుగం మూవీ మలయాళం టీజర్‌ను మేకర్స్ విడుదల చేసారు…

పురాతన భవంతిలోకి ఓ వ్యక్తి కాగడను పట్టుకొని వెళ్తున్న విజువల్స్‌ మరియు సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా సాగుతూ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. అలాగే చిత్ర యూనిట్ కొన్ని రోజుల క్రితం లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌లో డార్క్‌ షేడ్స్‌లో ఉన్న ఇల్లు కనిపిస్తుండగా.. దాని ముందు ఓ వ్యక్తి చేతిలో కాగడాను పట్టుకున్నాడు.మరోవైపు సిద్దార్థ్‌ భరతన్‌ డార్క్ షేడ్స్‌లో ఓ గుమ్మంలో నుంచి కాగడా పట్టుకొని.. కొంచెం భయంగా నడుచుకుంటూ వస్తూ.. సినిమాపై మరింత క్యూరియాసిటీ రేకెత్తిస్తున్నాడు. ముక్కుపుడక, నడుముకు హారంతో ఆదివాసీ వ్యక్తిని పోలిన గెటప్‌లో ఉన్న అమల్ద లిజ్‌ స్టన్నింగ్‌ లుక్ సినిమాపై సూపర్‌ బజ్‌ క్రియేట్ చేస్తోంది. హార్రర్ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ మరియు వై నాట్ స్టూడియో బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పోస్టర్స్, టీజర్స్ తోనే ఆసక్తి రేకెత్తించిన భ్రమయుగం మూవీ విడుదల అయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి..

Exit mobile version