Bramayugam : భారీ ధరకు సేల్ అయిన మమ్ముట్టి భ్రమయుగం ఓటీటీ రైట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ భ్రమయుగం.. ఈ మూవీ డిఫరెంట్ ఎక్స్‌పరిమెంటల్ మూవీగా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. బ్లాక్ అండ్ వైట్ ఫార్మెట్‌లో కేవలం మూడు పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.9 రోజుల్లోనే ఇరవై కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో వారం ఆలస్యంగా ఈ శుక్రవారం (ఫిబ్రవరి 23న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులో కూడా ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాల్లో ఒకటిగా భ్రమయుగం నిలిచింది.అయితే భ్రమయుగం ఓటీటీ డీల్ మలయాళ సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
మమ్ముట్టి ప్రస్తుతం వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు. ఆయన గత సినిమాలు కన్నూర్ స్క్వాడ్ వంద కోట్లు మరియు కాథల్ యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టాయి. మరోవైపు భ్రమయుగం టీజర్స్ మరియు ట్రైలర్స్ ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ రేకెత్తించడంతో ఈ సినిమా ఓటీటీ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం.దాదాపు 30 కోట్లకు సోనీ లివ్ భ్రమయుగం డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.మమ్ముట్టి కెరీర్‌లో అత్యధిక ధరకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిన మూవీగా భ్రమయుగం నిలిచింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం మరియు కన్నడ భాషల హక్కులు మొత్తం సోనీ లివ్ దక్కించుకున్నట్లు తెలిసింది. మార్చి నెలాఖరున సోనీ లివ్‌లో భ్రమయుగం స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. భ్రమయుగం మూవీతో మమ్ముట్టి వరుసగా ఆరో బ్లాక్‌బస్టర్స్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం టర్బో మరియు బజూకతో పాటు మరో సినిమాను చేస్తున్నారు. అలాగే రీసెంట్ గా తెలుగులో వైఎస్ జగన్ బయోపిక్‌గా తెరకెక్కిన యాత్ర 2లో మమ్ముట్టి గెస్ట్ రోల్‌లో కనిపించి మెప్పించారు.
Also Read
- Tags
- Bramayugam
- Mammootty
- OTT
- rites
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!