Mallu Bhatti Vikramarka: కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గాంధీ భవన్ లో నేడు ప్రజా వాణి కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు గాంధీ భవన్ లో దరఖాస్తులు పరిష్కరించనున్నారు. అనంతరం కాంగ్రెస్ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వం.. లోపల బంధించుకుని పాలించే వాళ్ళు అన్నారు. ప్రజా పాలనలో మంత్రులు, ముఖ్యమంత్రులే ప్రజల దగ్గరకు వెళ్తున్నామన్నారు. విద్య, వైద్యం పైనా మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. 59 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గ్రూప్ 1 కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న వాళ్ల కోసం పరీక్షలు పెట్టామని క్లారిటీ ఇచ్చారు. తిరకాసు పెట్టీ పరీక్షలు పెట్టకుండా కుటిల ప్రయత్నాలు చేశారు బీఆర్ఎస్ నేతలు చేశారని మండిపడ్డారు. వాటిని ఎదుర్కొని పరీక్షలు పెట్టామని భట్టి విక్రమార్క తెలిపారు. ఆర్టీసీ బస్సుల కొనుగోలు కూడా మహిళా సంఘాలతో కొనిస్తామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామన్నారు. కుల గణన దేశానికి తెలంగాణ మోడల్ అన్నారు. కొద్ది మంది దోపిడీ దారులు అడ్డుకోవాలని తప్పుడు ప్రచారం చేశారు, చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
M. Venkaiah Naidu: అమ్మ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోండి..
Mallu Bhatti Vikramarka: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం..
- ఆర్టీసీ బస్సుల కొనుగోలు కూడా మహిళా సంఘాలతో కొనిస్తాం..
- కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాం..
- కుల గణనకు కొద్ది మంది దోపిడీ దారులు అడ్డుకోవాలని తప్పుడు ప్రచారం..