NTV Telugu Site icon

Azharuddin: అజారుద్దీన్ కు మల్కాజ్‌గిరి కోర్టులో ఊరట..

Azaruddin

Azaruddin

మాజీ హెచ్‌సీఏ అధ్యక్షులు అజారుద్దీన్ కు మల్కాజ్‌గిరి కోర్టులో ఊరట దొరికింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అజారుద్దీన్ మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఇక, హెచ్‌సీఏ అధ్యక్షులుగా ఉన్న సమయంలో కోట్ల రూపాయలు నిధులు దోచుకున్నాడని సుప్రీం కోర్టు నియమించిన లావు నాగేశ్వరరావు కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక, ఈ ఫిర్యాదు మేరకు అజారుద్దీన్ పై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also: Kotabommali PS Teaser: శ్రీకాంత్ నట విశ్వరూపం.. అదిరిపోయిన కోటబొమ్మాళీ టీజర్

అయితే, ఉప్పల్ పోలీసులు నమోదు చేసిన కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టులో అజారుద్దీన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మల్కాజ్‌గిరి కోర్టు ఆయనకి ముందస్తు మంజూరు చేసింది. 41 CRPC కింద నోటీసులు ఇచ్చి అజారుద్దీన్ ను విచారించాలని మల్కాజ్‌గిరి కోర్టు తెలిపింది. పోలీసుల విచారణకు సహకరించాలని అజారుద్దీన్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అజారుద్దీన్ బరిలో ఉన్నారు.

Read Also: Bigg Boss Telugu 7: కాళ్లు పట్టుకొని బతిమిలాడిన అశ్విని.. ఫైర్ అయిన శివాజీ

ఇక, అజారుద్దీన్ 2020 నుంచి 2023 వరకు హెచ్ సీ ఏలో కోట్ల రూపాయల నిధులు గోల్ మాల్ చేశారని ఫారెన్సిక్ నివేదిక వెల్లడించింది. ఆగస్ట్ 10వ తేదీన హెచ్ సీ ఏ నిధులపై సుప్రీం కోర్ట మాజీ న్యాయవాది జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు కమిటీ ఆడిట్ నిర్వహించింది. ఇందులో క్రికెట్ బాల్స్ కొనుగోలులో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. దీంతో ఉప్పల్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేయడంతో అజారుద్దీన్ పై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు.

Show comments