NTV Telugu Site icon

India- Maldives: భారత్ తో పెట్టుకోవద్దు.. ఇబ్బంది పడతావ్.. మాల్దీవుల అధ్యక్షుడికి ప్రజలు వార్నింగ్

Muizzu

Muizzu

భారత్- మాల్దీవుల మధ్య వివాదంతో సంబంధాలు చాలా దారుణంగా మారింది. దీని వెనుక ప్రధాన కారణం మరెవరో కాదు ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ.. ఎన్నికల ప్రచారంలో ఆయన బహిరంగంగానే భారత వ్యతిరేక నినాదాలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్‌లోని బీచ్‌లో పర్యటించడంతో మాల్దీవుల మంత్రులు కించపరిస్తూ కామెంట్స్ చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది.

Read Also: Sankranti Festival: పల్లెకు సంక్రాంతి శోభ.. గ్రామాలకు క్యూ కట్టిన పట్నం వాసులు..

పర్యాటక పరంగా మాల్దీవులు అభివృద్ధి చెందిన దేశం.. కానీ, ఈ పర్యాటక ప్రదేశం ఇప్పుడు భారతీయ పర్యాటకుల బహిష్కరణతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దాని ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలో పడేస్తోంది. గత ఏడాది లెక్కల ప్రకారం.. మాల్దీవులను సందర్శించిన పర్యాటకుల సంఖ్య భారత్ నుంచి అత్యధికంగా ఉంది. కానీ, భారతదేశంలోని 140 కోట్ల జనాభాతో పోలిస్తే మాల్దీవులు 5, 20, 000 జనాభా కలిగిన చిన్న ద్వీప దేశం. ఇది ఆహారం, మౌలిక సదుపాయాలతో పాటు సాంకేతిక పురోగమనాల వంటి ముఖ్యమైన వాటి కోసం భారత్ పై ఎక్కువగా ఆధారపడుతుంది. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదంతో సంబంధాలను మరింత దెబ్బ తిన్నాయి.

Read Also: Governor Tamilisai: రాజ్‌భ‌వ‌న్‌లో భోగి వేడుక‌లు.. పాయసం వండిన గవర్నర్‌

ఇక, భారత్- మల్దీవుల మధ్య వివాదంతో స్థానిక ప్రజలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తమ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూపై విమర్శలు గుప్పిస్తున్నారు. దౌత్యపరమైన సమస్యలు రావడంతో మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టాలను కలిగిస్తుంది అని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల మన దేశ సాంస్కృతిక, ఆర్థిక, భౌగోళిక రాజకీయ సంబంధాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు. మాల్దీవులకు భారత్ వ్యూహాత్మక మిత్రదేశం సైనిక సిబ్బందితో పాటు హెలికాప్టర్లను అందించిన విషయాన్ని వారు తెలియజేస్తున్నారు. అయితే, చైనా అనుకూలమని భావించే మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ నవంబర్‌లో ఎన్నికైనప్పటి నుంచి భారత్ తో సంబంధాలు క్షీణిస్తున్నాయి.